IPL Auction 2023: 10 జట్లు.. 80 మంది ఆటగాళ్లు.. రూ.167 కోట్లు.. మెగా వేలం రికార్డులను బ్రేక్‌ చేసిన మినీ వేలం

రికార్డుల మోత. మినీ వేలమే అయినా.. ప్లేయర్లపై బడా ఇన్వెస్ట్‌. ఆల్‌రౌండర్లైతే హాటు కేకులే. ఇదీ ఈరోజు ఐపీఎల్‌ ఆక్షన్‌లో కనిపించిన సీన్లు. కొందరు ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా పోటీ పడితే.. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఇంకొందరు సీనియర్‌ ప్లేయర్లు.. వేలంలో వెలవెలబోయారు. స్వీట్‌ అండ్‌ సోర్‌లా సాగిన ఐపీఎల్‌ వేలం

IPL Auction 2023: 10 జట్లు.. 80 మంది ఆటగాళ్లు.. రూ.167 కోట్లు.. మెగా వేలం రికార్డులను బ్రేక్‌ చేసిన మినీ వేలం
Ipl Auction 2023
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 23, 2022 | 9:50 PM

ఐపీఎల్‌ మినీ వేలం రికార్డులను తిరగరాసింది. ప్లేయర్లు గతం కన్నా ఘనంగా ధరలు పలికారు. ఇంగ్లిష్‌ ప్లేయర్లకు బంపర్‌ ధరలు పలికాయి. ఇక ఆల్‌రౌండర్‌ అయితే హాట్‌కేకుల్లా అమ్ముడు పోయారు. ఐపీఎల్‌ అంటేనే కాసుల లీగ్‌. మంచి ప్లేయర్‌పై డబ్బు వర్షం కురుస్తుంది. అటూ ఇటుగా ఉన్నా గిట్టుబావుతుంది. గతేడాది మెగా వేలం తర్వాత కొన్ని ఫ్రాంచైజీల్లో జట్టు కూర్పు కష్టమైంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ వంటి టీమ్స్‌లో సమతూకం లోపించింది. దీంతో ఈసారి మినీ వేలాన్ని సమర్ధంగా ఉపయోగించుకోవాలని డిసైడ్‌ అయ్యాయి. ఐపీఎల్‌ మినీ వేలం మొదలైన దగ్గర్నుంచే ఫ్రాంచైజీలు పెద్ద ప్లేయర్స్‌ కోసం పోటీ పడ్డాయి.

ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా వేలంలో నలుగురు ఆటగాళ్లు 15 కోట్లకు పైగా అమ్ముడుపోయారు. IPL 2023 వేలం గురించి పెద్ద విషయాలు తెలుసుకోండి. ఐపీఎల్ 2023 వేలంలో మొత్తం 80 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఈ సందర్భంగా దాదాపు రూ.167 కోట్లు వెచ్చించారు. ఈ సీజన్ వేలంలో మొత్తం 29 మంది విదేశీ ఆటగాళ్లు అమ్ముడుపోయారు. అదే సమయంలో మినీ వేలంలో మొత్తం 51 మంది భారత ఆటగాళ్లను కొనుగోలు చేశారు.

రికార్డు సృష్టించింది వీరే..

ఇంగ్లండ్‌ యంగ్‌ ఆల్‌రౌండర్‌, టీ20 వరల్డ్‌ కప్‌ విన్నర్‌ శామ్‌ కరన్‌ భారీ ధర పలికాడు. అతడి కోసం ఆరు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. మొదట ముంబై, ఆర్సీబీ తర్వాత చెన్నై, లక్నో కూడా ప్రయత్నాలు చేశాయి. హీటెడ్‌ బిడ్డింగ్‌ తర్వాత చివర్లో వచ్చిన పంజాబ్‌ కింగ్స్‌ అతడిని 18.5 కోట్ల రూపాయల భారీ ధరకు ఎగరేసుకుపోయింది. ఇది ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే రికార్డు ధర. గతేడాది క్రిస్‌ మారిస్‌ని రాజస్థాన్‌ 16.25కోట్లకు కొనుక్కుని రికార్డు సృష్టిస్తే.. ఈ ఏడాది ఆ రికార్డును ముగ్గురు అధిగమించారు.. అందులో శామ్‌ కర్రన్‌ పద్దెనిమిదిన్నర కోట్లతో టాప్‌లో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సామ్ కుర్రాన్ ..

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ప్లేయర్‌ శామ్‌ కుర్రాన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. గాయం కారణంగా కుర్రాన్ లీగ్ చివరి సీజన్‌కు దూరమయ్యాడు. అయితే ఈ సీజన్‌లో అతను తిరిగి వస్తాడని భావిస్తున్నారు. కర్రాన్‌ను కొనుగోలు చేయడానికి.. అతని రెండు పాత జట్లు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సుదీర్ఘ పోరాటం జరిగింది. అందులో పంజాబ్ గెలిచింది. దీనితో పాటు, ఈ లీగ్‌లో అత్యధికంగా అమ్ముడైన ఆటగాడిగా కుర్రాన్ కూడా నిలిచాడు.

గ్రీన్‌ కోసం కూడా పోటా పోటీ ఆక్షన్‌

ఆస్ట్రేలియన్‌ ఆల్‌ రౌండర్‌ కామెరాన్ గ్రీన్‌ కోసం కూడా పోటా పోటీ ఆక్షన్‌ జరిగింది. 2 కోట్ల రూపాయల బేస్‌ ప్రైస్‌కి ఎంటరైన గ్రీన్‌ కోసం మంబై, బెంగళూరు, ఢిల్లీ పోటీ పడ్డాయి. ఎవరూ పట్టు వీడకపోవడంతో అంతకంతకూ బిడ్డింగ్‌ పెరిగిపోయింది. ముంబై ఇండియన్స్‌ నుంచి పొలార్డ్ వంటి ఆల్‌ రౌండర్‌ రిటైర్‌ అవడంతో ఆ ఫ్రాంచైజీ గ్రీన్‌ కోసం ప్రయత్నాలు చేసి చివరికి 17.5 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఆ వెంటనే సీనియర్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కోసం బిడ్డింగ్‌ జరిగింది. ఈసారి.. ఐదు ఫ్రాంచైజీలు స్టోక్స్‌పై కన్నేశాయి. బిడ్డింగ్‌ వార్‌ను ముందుకు తీసుకెళ్లాయి. 15 కోట్ల రూపాయల బిడ్డింగ్‌ తర్వాత ఎంటరైన చెన్నై సూపర్ కింగ్స్‌ యాజమాన్యం.. అతడిని 16.25 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. గతేడాది కెప్టెన్సీ గందరగోళం చెన్నై సూపర్‌ కింగ్స్‌ను వెనక్కి నెట్టేశాయి. ముందు జడేజా.. తర్వాత ధోనీ కెప్టెన్సీ చేసినా.. ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై కాలేకపోయింది. ఈఏడాదితో ధోనీ కూడా జట్టు నుంచి వైదొలగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బెన్‌ స్టోక్స్ కూడా కెప్టెన్‌ మెటీరియల్‌ కావడంతో అతడి కోసం ప్రయత్నాలు చేసి.. సక్సెస్‌ అయింది సూపర్ కింగ్స్‌.

బేస్‌ ప్రైస్‌తో బరిలో దిగి..

కేవలం కోటిన్నర బేస్‌ ప్రైస్‌తో బరిలో దిగాడు ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌. అతడి కోసం ఆర్సీబీ, RR, పోటీ పడ్డా.. చివరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అతడికి 13.25 కోట్లు బిడ్డింగ్‌ చేసి దక్కించుకుంది. ఓ విదేశీ బ్యాటర్‌పై ఇంత ఖర్చు చేయడం ఐపీఎల్‌ వేలంలోనే తొలిసారి. భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ని 8.25 కోట్లకు తీసుకుంది హైదరాబాద్‌ ఫ్రాంచైజీ. సఫారీ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ని 5.25కోట్లకు కొనుక్కుంది సన్‌రైజర్స్‌, లెగ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ను 2కొట్లకు, లోకల్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండేని 50లక్షలకు దక్కించుకుంది.

ఈసారి కూడా భారీ ధరే..

సన్‌రైజర్స్‌ నుంచి బయటకొచ్చేసిన నికోలస్‌ పూరన్‌ ఈసారి కూడా భారీ ధరే పలికాడు. అతడిని లక్నో 16 కోట్లకు తీసుకుంది. కరేబియన్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర 5.75కోట్లకు రాజస్థాన్‌కు అమ్ముడుపోయాడు. ఇలాంటి భారీ ధరలేకాదు.. సర్‌ప్రైజింగ్‌ కొనుగోళ్లూ ఉన్నాయి. యంగ్‌ పేసర్‌ శివం మావిని ఆరుకోట్లు పెట్టి గుజరాత్‌ టైటాన్స్‌ తీసుకుంటే.. బెంగాల్‌ ప్లేయర్‌ ముఖేష్‌ కుమార్‌ని ఐదున్నర కోట్లకు దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్‌.

ఇక వేలంలో భారీ ధరలే కాదు.. తక్కువ బిడ్డింగ్‌లూ నమోదయ్యాయి. కొందరు స్టార్లు అమ్ముడుపోలేదు కూడా. వారిలో టాప్‌ విలియంసన్‌. ఐపీఎల్‌ 2022లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా 14 కోట్ల రూపాయల శాలరీ తీసుకున్న ఈ కివీస్‌ సీనియర్‌.. ఈసారి కేవలం 2 కోట్ల రూపాయలే పలికాడు. అతడిని గుజరాత్‌టైటాన్స్‌ తీసుకుంది.

అజింక్య రహానే కేవలం 50లక్షల ధర పలికాడంటే.. అతడి కెరీర్‌ గురించి అర్ధం చేసుకోవచ్చు. పేసర్‌ ఇషాంత్‌ శర్మకూడా 50లక్షలే పలికాడు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ని తీసుకోడానికి ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. బంగ్లాదేశ్‌ సీనియర్‌ షకిబ్‌అల్‌ హసన్‌ కూడా అమ్ముడుపోలేదు. గతేడాది వేలంలో 6 కోట్ల ధర పలికిన ఓడియన్‌ స్మిత్‌పై ఈసారి 50లక్షల కన్నా ఎక్కువ పెట్టలేదు ఫ్రాంచైజీలు. ఇలా ఐపీఎల్‌ మినీ వేలం కొందరికి స్వీట్‌గా.. మరికొందరికి చేదుగా సాగింది.

ఈ ఆటగాళ్లకు భారీ మొత్తం..

  • సామ్ కుర్రాన్ – పంజాబ్ కింగ్స్ – రూ. 18.50 కోట్లు
  • కామెరాన్ గ్రీన్ – ముంబై ఇండియన్స్ – రూ. 17.50 కోట్లు
  • బెన్ స్టోక్స్ – చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 16.25 కోట్లు
  • హ్యారీ బ్రూక్ – రూ. 13.25 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
  • రిలే రోసో – రూ. 4.60 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
  • జాషువా లిటిల్ – 4.40 కోట్లు, గుజరాత్ టైటాన్స్
  • విల్ జాక్స్ – రూ. 3.20 కోట్లు – RCB
  • మనీష్ పాండే – రూ. 2.40 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
  • డేవిడ్ వీస్ – కోటి రూపాయలు – కోల్‌కతా నైట్ రైడర్స్ 

శివమ్ మావి అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్

  • శివమ్ మావి, రూ. 6 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • ముఖేష్ కుమార్, రూ. 5.50 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
  • వివ్రాంత్ శర్మ, రూ. 2.60 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
  • కెఎస్ భరత్, రూ. 1.20 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • ఎన్ జగదీషన్, రూ. 90 లక్షలు (కోల్‌కతా నైట్ రిడర్స్ )

మరిన్ని ఐపీఎల్ న్యూస్ కోసం