CSK IPL 2023 Auction: ఆ 3గురు చెన్నైకి మ్యాచ్ విన్నర్స్.. సీనియర్లకు తోడుగా యువ ప్లేయర్స్.. ధోని టీం ఇదే
Chennai Super Kings Auction Players List: 'కప్పు ముఖ్యం బిగిలూ'.. ఈ డైలాగ్ ఇప్పుడు చెన్నై టీంకి సరిగ్గా సూట్ అవుతుంది. ఐపీఎల్ 2023 మినీ వేలం ముగిసింది.
Chennai Super Kings Auction Players List: ‘కప్పు ముఖ్యం బిగిలూ’.. ఈ డైలాగ్ ఇప్పుడు చెన్నై టీంకి సరిగ్గా సూట్ అవుతుంది. ఐపీఎల్ 2023 మినీ వేలం ముగిసింది. ఫ్రాంచైజీలు అందరూ కూడా ట్రోఫీనే టార్గెట్ చేసి.. తమ జట్లను అద్భుతమైన ఆటగాళ్లతో బలోపేతం చేసుకున్నాయి. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అయితే.. మరో రెండు సీజన్ల వరకు సరిపోయే బలమైన స్క్వాడ్‌ను రెడీ చేసుకుంది. రుతురాజ్, స్టోక్స్, అలీ, శివమ్ దూబే, కాన్వ్, రాయుడు, జడేజా.. ఇంకా మన తల ధోని.. ఇలా జట్టు నిండా పించ్ హిట్టర్లే ఉన్నారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, శివమ్ దూబే రూపంలో విన్నింగ్ కాంబినేషన్‌ను ఎంపిక చేసి.. ధోని జట్టును స్ట్రాంగ్ చేశాడు. వచ్చే సీజన్ ట్రోఫీని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడు. మరి అసలు చెన్నై జట్టులోని ప్లేయర్స్ ఎలా ఉన్నారు.. రిలీజ్ చేసింది ఎవర్ని.. వేలంలో కొనుగోలు చేసింది ఎవరెవర్ని అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
-
వేలానికి ముందు రిలీజ్ చేసిన ప్లేయర్స్:
బ్రేవో, ఉతప్ప, మిలనె, నిశాంత్, జోర్డాన్, భగత్ వర్మ, ఆసిఫ్, జగదీషన్
-
రిటైన్ ప్లేయర్స్:
ధోని, కాన్వె, గైక్వాడ్, రాయుడు, సేనాపతి, మొయిన్ అలీ, శివం దూబే, హంగర్గేకర్, ప్రిటోరియస్, శాంట్నార్, జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరీ, పాతిరానా, సిమర్జీట్ సింగ్, దీపక్ చాహార్, సోలంకి, తీక్షనా
-
మినీ వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్స్ వీరే:
అజింక్యా రహనే, షేక్ రషీద్, బెన్ స్టోక్స్, నిశాంత్ సింధు, కైలీ జామిసన్, భగత్ వర్మ, అజయ్ మండల్
-
మొత్తం స్క్వాడ్:
మహేంద్ర సింగ్ ధోని, కాన్వె, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సేనాపతి, మొయిన్ అలీ, శివం దూబే, హంగర్గేకర్, ప్రిటోరియస్, శాంట్నార్, జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరీ, పాతిరానా, సిమర్జీట్ సింగ్, దీపక్ చాహార్, సోలంకి, తీక్షనా, అజింక్యా రహనే, షేక్ రషీద్, బెన్ స్టోక్స్, నిశాంత్ సింధు, కైలీ జామిసన్, భగత్ వర్మ, అజయ్ మండల్