Ind Vs Pak: ఎంఎస్ ధోనీ క్రీడాస్ఫూర్తి.. పాకిస్తాన్ ఆటగాళ్లతో సంభాషణ.. వీడియో వైరల్..

యూఏఈ, ఒమన్‎లో జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్‌లో సూపర్ 12 గ్రూప్-2 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ భారత్‎పై 10 వికెట్ల తేడా విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా మెంటర్ ఎంఎస్ ధోనీ పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీమ్, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, ప్రస్తుత కెప్టెన్ బాబర్ అజమ్‌తో సంభాషించారు....

Ind Vs Pak: ఎంఎస్ ధోనీ క్రీడాస్ఫూర్తి.. పాకిస్తాన్ ఆటగాళ్లతో సంభాషణ.. వీడియో వైరల్..
Dhoni
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 25, 2021 | 9:25 AM

యూఏఈ, ఒమన్‎లో జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్‌లో సూపర్ 12 గ్రూప్-2 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ భారత్‎పై 10 వికెట్ల తేడా విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా మెంటర్ ఎంఎస్ ధోనీ పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీమ్, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, ప్రస్తుత కెప్టెన్ బాబర్ అజమ్‌తో సంభాషించారు. ఆదివారం దుబాయ్‌లో మ్యాచ్ తర్వాత అనేక మంది పాకిస్తాన్ ఆటగాళ్లతో MS ధోనీ మాట్లాడుతున్న వీడియోను ఐసీసీ తన ఇన్‎స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. “ఇది భారత్-పాకిస్తాన్ క్రికెట్ యొక్క అన్ని హైప్‎లకు అతీతమైన నిజమైన కథ. #SpiritOfC Cricket #T20WorldCup.” క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని బౌలర్లు భారత్‌ను 151/7కు పరిమితం చేయడంతో 152 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా పాకిస్థాన్‌ ఛేదించింది. కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్తాన్ విజయం సాధించిన తర్వాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాకిస్తాన్ ఓపెనర్లు ఇద్దరితో మాట్లాడడం కనిపించింది. పాకిస్తాన్ ఆటగాళ్లు ధోనీతో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ధోనీ, విరాట్ ఏ మాత్రం సంకోచించకుండా క్రీడాస్ఫూర్తిని చాటి చెప్పారు.

“మేము మా ప్రణాళికలను బాగా అమలు చేశామని.. ప్రారంభంలో వికెట్లు తీయడం సహకరించిందని” అని బాబర్ చెప్పాడు. “మేము భారత్‌పై రికార్డు గురించి అస్సలు ఆలోచించలేదన్నాడు. బాగా సన్నద్ధమవుతున్న మా ఆటగాళ్లందరికీ మాత్రమే నేను మద్దతు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. టీ 20 లో ఏదైనా ప్రత్యర్థిపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇదే తొలిసారి కాగా, భారత్ కూడా తొలిసారిగా ఇంత తేడాతో ఓడిపోయిన పరాభవాన్ని ఎదుర్కొంది. 2007 లో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌ని ఓడించి భారత్ తొలి టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన టీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ మొదటిసారి భారత్‌పై విజయం సాధించింది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

Read Also.. Ind Vs Pak: ఎట్టకేలకు ఆ రోజు వచ్చింది.. టపాసులు కాల్చే అవకాశం తెచ్చింది..

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?