IND vs PAK: సరికొత్త రికార్డ్ సృష్టించిన పాక్ ఓపెనర్లు.. ఇప్పటివరకు వీరే ఫస్ట్..
IND vs PAK: టీ 20 వరల్డ్ కప్ 2021లో భారత్ ఓటమితో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా
IND vs PAK: టీ 20 వరల్డ్ కప్ 2021లో భారత్ ఓటమితో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. సూపర్ 12 దశలో మొదటి మ్యాచ్‌లోనే నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌కు ముందు భారతదేశం, పాకిస్తాన్ జట్లు.. వన్డే, టి 20 ప్రపంచకప్‌లో మొత్తం12 సార్లు తలపడ్డాయి కానీ పాకిస్తాన్ గెలవలేకపోయింది. మొదటిసారిగా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఖాతా తెరిచింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 152 పరుగుల లక్ష్యాన్ని ఇద్దరే చేధించారు.
ఒక టి20 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో వికెట్ కోల్పోకుండా జట్టును గెలిపించిన సందర్భాలు ఇప్పటివరకు మూడుసార్లు మాత్రమే జరిగాయి. 2007లో శ్రీలంకపై 102/0, 2012లో జింబాబ్వేపై దక్షిణాప్రికా 94/0, 2021లో పపువా న్యూ గినియాపై ఒమన్ 130/0 ఉన్నాయి. తాజాగా టీమిండియాపై పాకిస్తాన్ ఓపెనర్లు వికెట్ కోల్పోకుండా 152 పరుగులు చేధించడం విశేషం. అంతేగాక ఈ ఇద్దరు మరో రికార్డు కూడా సాధించారు.
తొలి వికెట్‌కు 152 పరుగులు జోడించిన ఈ ఇద్దరు.. టి20ల్లో పాక్ తరపున ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యంగా నిలిచింది. ఇంతకముందు 2012 టి20 మ్యాచ్‌లో మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ జంట నాలుగో వికెట్‌కు 104 పరుగులు జోడించడం ఇప్పటివరకు అత్యధికంగా ఉండేది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధికంగా 57 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 39 పరుగులు చేశారు. మిగతావారు ఎవ్వరూ పెద్దగా రాణించలేదు.