AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 10 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీని గెలవని టీమిండియా.. అసలు కారణం ఇదేనంటూ బాంబ్ పేల్చిన సౌరవ్ గంగూలీ..

Sourav Ganguly: పదేళ్లుగా భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవకపోవడంపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.

Team India: 10 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీని గెలవని టీమిండియా.. అసలు కారణం ఇదేనంటూ బాంబ్ పేల్చిన సౌరవ్ గంగూలీ..
Ganguly
Venkata Chari
|

Updated on: Mar 28, 2023 | 9:06 PM

Share

భారత క్రికెట్ జట్టు గత 10 ఏళ్లుగా ఐసీసీ స్థాయి టోర్నీని గెలవలేదు. 2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి నుంచి ఐసీసీ స్థాయి టోర్నీలో విజేతగా నిలిచే విషయంలో టీమిండియా బ్యాగ్ ఖాళీగానే ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌లో భారత జట్టు నిలకడగా రాణిస్తోంది. ఇది ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా పేరుగాంచింది. కానీ, ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది. ఈ సమయంలో భారత జట్టు చాలా నాకౌట్ మ్యాచ్‌ల నుంచి నిష్క్రమించింది. ఐసీసీ ట్రోఫీని గెలుచుకోగల ప్రతిభ టీమ్ ఇండియాకు ఉందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా ఐసీసీ ట్రోఫీని భారత్ ఎలా గెలవగలదో చెప్పుకొచ్చాడు.

దూకుడుగా ఆడాలి..

టైమ్స్ ఆఫ్ ఇండియాతో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, ‘భారతదేశంలో ప్రతిభకు కొరత లేదు. మనం ఎలా సిద్ధం చేస్తాం అన్నదే సమస్య. భారత్ ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో దూకుడుగా ఆడాలి. దీన్ని చేయగల బృందం మన వద్ద ఉంది. అక్షర్ పటేల్ కొన్నిసార్లు 9వ స్థానంలో బ్యాటింగ్ చేస్తుంటాడు. అతను టాప్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడాలి. హార్దిక్ పాండ్యా 6వ స్థానంలో, రవీంద్ర జడేజా 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నారు. జట్టులో చాలా డెప్త్ ఉంది. దీంతో ఒత్తిడిని సర్దుబాటు చేయడం అలవాటు చేయాలి. ఆట గురించి తెలుసుకోవడం, తదనుగుణంగా బ్యాటింగ్ చేయడం అలవాటు చేయాలి. భారత క్రికెట్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎప్పుడూ ఉంటారు. పెద్ద టోర్నమెంట్‌కు మీరు ఎలా సిద్ధమవుతారు అనేది పాయింట్?’ అంటూ చెప్పుకొచ్చాడు.

చాలా మంది ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతున్నారు..

‘అన్ని ఫార్మాట్లలో ఆడే చాలా మంది భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. కొన్నిసార్లు వారిని ఒక ఫార్మాట్ నుంచి మరొక ఫార్మాట్‌కు మార్చడం కష్టం అవుతుంది’ అని చెప్పుకొచ్చాడు. ఈ ప్రశ్నకు గంగూలీ స్పందిస్తూ.. ‘ఆటగాడు రిథమ్‌లో ఉంటే అందులో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. మంచి ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలో తమను తాము తీర్చిదిద్దుకుంటారు. భారతదేశంలో చాలా ప్రతిభ ఉంది. కొంతమంది ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలో ఒకే విధంగా ఉంటారు. అలానే ఉండాలి. ఎందుకంటే ఆటలో రిథమ్ చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను’ అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..