Watch Video: 49 పరుగులకే 4 వికెట్లు.. క్లిష్ట పరిస్థితిలో క్రీజులోకి.. 17 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ బాదిన ప్లేయర్..

Josh Clarkson: ఫోర్డ్ ట్రోఫీ ఫైనల్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ 6 వికెట్ల తేడాతో కాంటర్‌బరీని ఓడించింది. జోష్ క్లార్క్సన్ కేవలం 78 బంతుల్లో 111 పరుగులు చేసి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 213 పరుగుల లక్ష్యాన్ని 43.3 ఓవర్లలో ఛేదించింది.

Watch Video: 49 పరుగులకే 4 వికెట్లు.. క్లిష్ట పరిస్థితిలో క్రీజులోకి.. 17 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ బాదిన ప్లేయర్..
Josh Clarkson Viral Video
Follow us

|

Updated on: Mar 28, 2023 | 9:38 PM

49 పరుగులకే 4 వికెట్లు పడిపోయాయి. బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పరుగులు సాధించలేక బ్యాటర్లు అవస్థలు పడుతున్నారు. అయితే ఈ కష్టాలన్నీ జోష్ క్లార్క్‌సన్‌పై ప్రభావం చూపలేదు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ న్యూజిలాండ్ వన్డే టోర్నమెంట్ ఫోర్డ్ ట్రోఫీలో అద్భుతాలు చేశాడు. ఫోర్డ్ ట్రోఫీ టైటిల్ మ్యాచ్‌లో కాంటర్బరీని సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాంటర్‌బరీ జట్టు కేవలం 212 పరుగులకే కుప్పకూలింది. ప్రతిస్పందనగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ 43.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది.

సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టులో హీరో జోష్ క్లార్క్సన్ 78 బంతుల్లో అజేయంగా 111 పరుగులు చేశాడు. ఈ ఆటగాడు 17 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. చాలా క్లిష్టమైన స్థితిలో వచ్చిన అతను సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గొప్ప విషయం ఏమిటంటే క్లార్క్సన్ స్ట్రైక్ రేట్ 140 కంటే ఎక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఛేజింగ్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బెన్ స్మిత్, జాక్ బాయిల్, బ్రాడ్ ష్ముల్లిన్, డేన్ క్లీవర్ పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత కెప్టెన్ టామ్ బ్రూస్ క్రీజులో అడుగుపెట్టాడు. అదే సమయంలో జోష్ క్లార్క్‌సన్ స్లోగా మొదలుపెట్టాడు. బ్రూస్ 84 బంతుల్లో 51 పరుగులు చేశాడు. క్లార్క్సన్ తన లిస్ట్ ఏ కెరీర్‌లో మూడో సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ మధ్య 167 పరుగుల తిరుగులేని భాగస్వామ్యం నెలకొంది. దీని కారణంగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఫోర్డ్ ట్రోఫీని గెలుచుకుంది.

క్లార్క్సన్ తన సెంచరీని 70 బంతుల్లో పూర్తి చేశాడు. సెంచరీ చేసిన తర్వాత క్లార్క్సన్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ సెంచరీ చేసిన తర్వాత అతని ఛాతీపై మూడుసార్లు బ్యాట్ కొట్టాడు. అతని ఇన్నింగ్స్‌కు ప్రత్యర్థి జట్టు కూడా సెల్యూట్ చేసింది. క్లార్క్సన్ బౌలింగ్‌లో కూడా సత్తా చాటాడు. ఈ ఆటగాడు 10 ఓవర్లలో 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తన అద్భుతమైన ఆల్ రౌండ్ గేమ్‌కు క్లార్క్‌సన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఫోర్డ్ ట్రోఫీలో ఒటాగోకు చెందిన హమీష్ రూథర్‌ఫోర్డ్ అత్యధికంగా 408 పరుగులు సాధించాడు. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ బౌలర్ బ్రెట్ రాండాల్ అత్యధికంగా 18 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 3.71 పరుగులుగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!