- Telugu News Photo Gallery Cricket photos Rashmika mandanna katrina kaif tiger shroff arijit singh tehse stars in ipl 2023 opening ceremony
IPL 2023 ఓపెనింగ్ వేడుకలో నేషనల్ క్రష్ సందడి.. బాలీవుడ్ స్టార్లలో ఎవరున్నారంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ప్రతిసారీ లాగానే ఈసారి కూడా తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ వేడుక నిర్వహించనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్లు తమ ప్రదర్శనతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
Updated on: Mar 28, 2023 | 8:52 PM

IPL Team Squads and Their best Playing XI

మీడియా కథనాల ప్రకారం IPL ప్రారంభ వేడుకలో రష్మిక మందన్నను చూడొచ్చు. రష్మిక సౌత్‌లో చాలా పెద్ద నటి. ఇటీవలే పుష్ప అనే సినిమాతో రష్మికకు దేశ వ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ సినిమా నార్త్‌లో ఆమె ఖ్యాతిని బాగా పెంచింది.

ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో రష్మికతో పాటు బాలీవుడ్ వెటరన్ నటి కత్రినా కైఫ్ కూడా కనిపించనుంది. ప్రస్తుతం కత్రినా పేరుకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. కానీ, ఆమె పేరు కూడా మీడియా నివేదికలలో హల్ చల్ చేస్తోంది.

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కూడా ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకలో పర్ఫార్మెన్స్ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. టైగర్ తన అద్భుతమైన డ్యాన్స్‌కు పేరుగాంచాడు. అతను ప్రారంభ వేడుకలో కనిపిస్తే, అభిమానులు మరోసారి అతని అద్భుతమైన నృత్యాన్ని చూడొచ్చు.

డ్యాన్స్‌తో పాటు, పాటలు కూడా ప్రారంభ వేడుకలలో అలరించనున్నాయి. బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ IPL ప్రారంభ వేడుకలో తన పాటలతో మరింత జోష్ పెంచేందుకు సిద్ధమవుతున్నాడు.




