Viral Video: ఇదేమి బాల్‌రా నాయనా.. మంత్రం వేసినట్టు స్టంప్స్‌నే లేపేసింది.. వైరల్ వీడియో..

ఔట్ కావొద్దని బ్యాటర్ ఎంతో ట్రై చేశాడు. కానీ, చివరకు అతని ప్రయత్నాలను విఫలం చేస్తూ.. ఓ బాల్ అతనిని పెవిలియన్ చేర్చింది. ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral Video: ఇదేమి బాల్‌రా నాయనా.. మంత్రం వేసినట్టు స్టంప్స్‌నే లేపేసింది.. వైరల్ వీడియో..
Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: May 21, 2022 | 6:31 PM

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని తెగ నవ్విస్తాయి. వీటిలో క్రికెట్‌కు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తుంది. ఔట్ కావొద్దని బ్యాటర్ ఎంతో ట్రై చేశాడు. కానీ, చివరకు అతని ప్రయత్నాలను విఫలం చేస్తూ.. పెవిలియన్ చేర్చింది. ఇంగ్లండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కౌంటీ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా హాంప్‌షైర్‌తో సోమర్‌సెట్ తలపడింది. ఈ మ్యాచ్‌లో సోమర్‌సెట్‌ సారథి టామ్‌ అబెల్‌ విఫల ప్రయత్నాలు చేస్తూ పెవిలయన్ చేరడం నెటిజన్లకు షాకిచ్చింది.

Also Read: Deepak Chahar Wedding: జూన్ 1న పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్.. వధువు ఎవరంటే?

హాంప్‌షైర్‌ బౌలర్ మహ్మద్‌ అబ్బాస్‌ వేసిన ఫాస్ట్ బౌలింగ్‌ను టామ్‌ అబెల్‌ డిఫెండ్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అది బ్యాట్‌కు తగిలి పైకి లేచింది. బ్యాట్స్‌మెన్ ముందుచూపుతో వికెట్లను తాకుతుందేమోనని గ్రహించి, కాలితో ఆపేందుకు ట్రై చేశాడు. ఔట్ కాకుడదని విఫల ప్రయత్నాలు చేశాడు. చివరికి బాల్ మాత్రం.. తగ్గేదేలే అంటూ వికెట్లను ముద్దాడి బెయిల్స్‌‌ను కిందపడేశాయి. ప్రయత్నించి విఫలమవడంతో టామ్‌ అబెల్‌ తీవ్ర అసహనంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

Also Read: MI vs DC, IPL 2022: రంగు మార్చిన బెంగళూర్ జట్టు.. ఈ ఎక్స్‌ట్రాలే వద్దంటోన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

MI vs DC, IPL 2022: రోహిత్ భయ్యా.. కోహ్లీ కోసం ఈ ఒక్కసారి ప్లీజ్ అంటోన్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?