Team India : టీమిండియా బ్యాటింగ్ సంక్షోభం..టెస్ట్ జట్టుకు సంజీవనిలా మారబోతున్న నలుగురు యంగ్ ప్లేయర్స్
భారత టెస్ట్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ ప్రదర్శన ప్రస్తుతం తీవ్ర విమర్శల పాలవుతోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో 3-0 తేడాతో ఓడిపోవడం, సౌతాఫ్రికా పై కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఇబ్బంది పడటం వంటి సంఘటనలు జట్టు పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అసలు టీమిండియా బ్యాటింగ్‌కు కొత్త ఎనర్జీ ఎవరు ఇవ్వగలరు అనే ప్రశ్న తలెత్తుతోంది.

Team India : భారత టెస్ట్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ ప్రదర్శన ప్రస్తుతం తీవ్ర విమర్శల పాలవుతోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో 3-0 తేడాతో ఓడిపోవడం, సౌతాఫ్రికా పై కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఇబ్బంది పడటం వంటి సంఘటనలు జట్టు పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అసలు టీమిండియా బ్యాటింగ్‌కు కొత్త ఎనర్జీ ఎవరు ఇవ్వగలరు అనే ప్రశ్న తలెత్తుతోంది. దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారిస్తే అనేకమంది యువ ఆటగాళ్లు నిలకడగా భారీ పరుగులు చేస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ఆటగాళ్లు కేవలం స్పిన్నర్లను మాత్రమే కాదు, వేగవంతమైన పేస్ బౌలింగ్‌ను కూడా తమ అద్భుతమైన టెక్నిక్, సహనంతో ఎదుర్కోగలరు. ఈ యువకులకు అవకాశం ఇస్తే, టీమిండియా బ్యాటింగ్ లైనప్‌కు కొత్త బలం చేకూరుతుంది. టెస్ట్ జట్టులో మార్పు తీసుకురాగల నలుగురు ముఖ్యమైన ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.
1. రవిచంద్రన్ స్మరణ్
కేవలం 22 సంవత్సరాల వయసులోనే రవిచంద్రన్ స్మరణ్ దేశవాళీ క్రికెట్‌లో పెద్ద పేరు సంపాదించుకున్నాడు. 2024 లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ ఆటగాడు కేవలం 19 ఇన్నింగ్స్‌లలో 1179 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 78 కంటే ఎక్కువ ఉంది. అంటే అతను క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలబడి ఆడగలడని అర్థం. ఇప్పటివరకు నాలుగు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. నాల్గవ స్థానంలో అతని బలమైన బ్యాటింగ్ టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు పెద్ద ఉపశమనం ఇవ్వగలదు.
2. యశ్ ధుల్
అండర్-19 ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించిన కెప్టెన్ యశ్ ధుల్ ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. అతను ఇప్పటివరకు ఆడిన 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 47 సగటుతో 2777 పరుగులు చేశాడు. 9 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేసిన యశ్ బలంగా, సహనంతో కూడిన బ్యాటర్‌గా పేరు పొందాడు. టెస్ట్ క్రికెట్‌లో నెమ్మదిగా ఉండే, సవాలుతో కూడిన పిచ్‌లలో అతను జట్టుకు విలువైన ఆటగాడు కాగలడు.
3. యశ్ రాథోడ్
గత రంజీ సీజన్‌లో విదర్భ జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో ముఖ్య పాత్ర పోషించిన యశ్ రాథోర్, ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో నమ్మదగిన బ్యాటర్లలో ఒకరిగా పరిగణించబడుతున్నాడు. 25 ఏళ్ల యశ్ 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 61 కంటే ఎక్కువ సగటుతో 2449 పరుగులు చేశాడు. అతని 9 సెంచరీలు అతని అద్భుత ప్రదర్శనను తెలియజేస్తాయి. మిడిల్ ఆర్డర్‌లో అతను లాంగ్ ఇన్నింగ్స్‌లు ఆడగల కెపాసిటీ కలిగి ఉన్నాడు.
4. రింకూ సింగ్
సాధారణంగా టీ20 ఫార్మాట్‌లో తన ఫినిషింగ్ నైపుణ్యం, భారీ సిక్సర్‌ల కోసం రింకూ సింగ్‌ను గుర్తుంచుకుంటారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని రికార్డు మరింత అద్భుతంగా ఉంది. రింకూ 52 మ్యాచ్‌లలో 59 కంటే ఎక్కువ సగటుతో 3677 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అద్భుతమైన టెక్నిక్, నిగ్రహం అతన్ని టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకోవడానికి బలమైన పోటీదారుడిని చేశాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
