Test Cricket : అది ఒకప్పుడు.. ఇప్పుడంతా బాదుడే.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ఆటగాళ్లు వీళ్లే
టీ20లు వచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్ కాస్త వెనుకబడింది. కానీ ఆటగాళ్లు కూడా కాలనుగుణంగా ఆటతీరు మార్చుకున్నారు. క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే. బెన్ స్టోక్స్ 133 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలవగా, మెకల్లమ్, గిల్‌క్రిస్ట్, సౌథీ, గేల్ వంటి దిగ్గజాలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Test Cricket : టెస్ట్ క్రికెట్‌ను ఓపికగా, నిదానంగా ఆడతారని అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఐదు రోజుల పాటు జరిగే ఈ ఆటను వన్డే, టీ20లతో పోలిస్తే తక్కువ మంది చూస్తుంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. టీ20ల ప్రభావం టెస్టుల మీద పడింది. ఇప్పుడు బ్యాటర్లు టెస్టుల్లో కూడా సిక్సర్లతో దుమ్ములేపుతున్నారు. వేగంగా పరుగులు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాటర్లు ఎవరో తెలుసుకుందాం.
టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ప్లేయర్లు
బెన్ స్టోక్స్ – 133 సిక్సర్లు
ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ ప్రస్తుత కెప్టెన్ బెన్ స్టోక్స్ అగ్రెసివ్ క్రికెట్‌కు సరికొత్త ఉదాహరణ. అతను ఇప్పటివరకు 112 టెస్టుల్లో 201 ఇన్నింగ్స్‌లలో 6781 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 133 సిక్సర్లు ఉన్నాయి. ఈ సంఖ్యతో స్టోక్స్ టెస్ట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అతని బ్యాటింగ్ సగటు 35.31 కాగా, 786 ఫోర్లు కొట్టాడు. స్టోక్స్ బ్యాటింగ్ స్టైల్ ఇంగ్లాండ్ బజ్‌బాల్ ఆటతీరులో ముఖ్యమైన భాగం.
బ్రెండన్ మెకల్లమ్ – 107 సిక్సర్లు
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెకల్లమ్, టెస్ట్ క్రికెట్‌లో దూకుడు ఆటకు పునాది వేశాడు. అతను 101 టెస్ట్ మ్యాచ్‌లలో 6453 పరుగులు చేశాడు. అందులో 107 సిక్సర్లు ఉన్నాయి. అతని బ్యాటింగ్ సగటు 38.64 కాగా, 776 ఫోర్లు బాదాడు. బజ్‌బాల్ స్టైల్‌కు ఆద్యుడి చెబుతారు. మెకల్లమ్ దూకుడు ఆటతీరు టెస్ట్ క్రికెట్ పాత ఆలోచనలను మార్చేసింది.
ఆడమ్ గిల్‌క్రిస్ట్ – 100 సిక్సర్లు
మూడో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నారు. అతను బ్యాట్‌తో కూడా ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించాడు. 96 టెస్ట్ మ్యాచ్‌లలో 137 ఇన్నింగ్స్‌లలో 5570 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 100 సిక్సర్లు ఉన్నాయి. అతని సగటు 47.60 కాగా, 677 ఫోర్లు కొట్టాడు.
టిమ్ సౌథీ – 98 సిక్సర్లు
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన టిమ్ సౌథీ, బ్యాటింగ్‌లోనూ చాలా ప్రమాదకరం. అతను 107 టెస్టులలో 2245 పరుగులు చేసి, 98 సిక్సర్లు బాదాడు. అతని బ్యాటింగ్ సగటు 15.48 మాత్రమే అయినా, లోయర్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు చేయడంలో అతన్ని మించిన వాళ్ళు లేరు.
క్రిస్ గేల్ – 98 సిక్సర్లు
‘యూనివర్స్ బాస్’ క్రిస్ గేల్ కేవలం టీ20 క్రికెట్‌లో మాత్రమే కాదు టెస్టుల్లోనూ సిక్సర్ల కింగ్. అతను 103 టెస్టుల్లో 182 ఇన్నింగ్స్‌లలో 7214 పరుగులు చేశాడు. అందులో 98 సిక్సర్లు ఉన్నాయి. అతని సగటు 42.18 కాగా, 1046 ఫోర్లు కొట్టాడు. గేల్ స్టైల్ టెస్ట్ క్రికెట్‌లో కూడా టీ20 లాగే ప్రమాదకరంగా ఉండేది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..