- Telugu News Photo Gallery Cricket photos From Bert Vance to mohammad sami including these 5 bowlers bowled highest balls in a single over
Unique Records: ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులతో చెత్త రికార్డు.. లిస్ట్‌లో ఐదుగురు.. టాప్ ప్లేయర్‌ని చూస్తే..
Unique Cricket Records: క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన బౌలర్లు ఐదుగురు ఉన్నారు. దీంతో ఈ చెత్త ప్రపంచ రికార్డులో ఈ ఐదుగురు చేరిపోయారు. ఇక ఈ లిస్ట్‌లో ఎవరున్నారో చూస్తే, కచ్చితంగా షాక్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Updated on: Jul 06, 2025 | 1:52 PM

Unique Cricket Records: క్రికెట్‌లో ఒక బ్యాటర్ రనౌట్ కావడం ఎంత నిరాశ కలిగిస్తుందో.. అదేవిధంగా ఒక ఓవర్‌లో 6 బంతుల కంటే ఎక్కువ బౌలింగ్ చేయడం బౌలర్‌కు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగిస్తుంది. క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్ లో అత్యధిక బంతులు వేసిన ఐదుగురు బౌలర్లు ఉన్నారు. క్రికెట్ నియమాల ప్రకారం, ఒక ఓవర్‌లో 6 చట్టబద్ధమైన బంతులు వేయడం తప్పనిసరి. కానీ, 1 ఓవర్‌లో వైడ్లు, నోబాల్స్ ఇలా ఓవర్ రూపు రేఖలు మార్చేసిన చెత్త బౌలర్లు ఉన్నారు. ఈ లిస్టులో టాప్ 5 బౌలర్లను ఓసారి చూద్దాం..

1. బెర్ట్ వాన్స్ (న్యూజిలాండ్): న్యూజిలాండ్ స్పిన్నర్ బెర్ట్ వాన్స్ ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన చెత్త రికార్డును కలిగి ఉన్నాడు. ఫిబ్రవరి 20, 1990న, న్యూజిలాండ్ స్పిన్నర్ బెర్ట్ వాన్స్ కాంటర్‌బరీతో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అత్యధిక బంతులు అంటే 22 బంతులు వేశాడు. వెల్లింగ్టన్ తరపున ఆడుతున్నప్పుడు బెర్ట్ వాన్స్ ఈ చెత్త రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్ తరపున నాలుగు టెస్టులు ఆడిన మాజీ క్రికెటర్ బెర్ట్ వాన్స్, క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ బౌలింగ్ చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. అతను తన ఓవర్‌లో 77 పరుగులు ఇచ్చాడు. 1990లో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో, కాంటర్‌బరీ ఆటగాడు లీ జర్మన్ ఒక్కడే ఒకే ఓవర్‌లో 70 పరుగులు చేశాడు. అయితే, అతని సహచరుడు రోజర్ ఫోర్డ్ 5 పరుగులు చేశాడు. బెర్ట్ వాన్స్ ఈ ఓవర్‌లో మొత్తం 22 బంతులు వేశాడు.

2. మహ్మద్ సమీ (పాకిస్తాన్): పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సమీ క్రికెట్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 17 బంతులు వేసి చెత్త రికార్డును కలిగి ఉన్నాడు. 2004 ఆసియా కప్ సందర్భంగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో మహ్మద్ సమీ ఒకే ఓవర్‌లో 17 బంతులు వేశాడు. ఈ సమయంలో, మహ్మద్ సమీ 7 వైడ్‌లు, 4 నో బాల్స్ వేశాడు.

3. కర్ట్లీ ఆంబ్రోస్ (వెస్టిండీస్): వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ కర్ట్లీ ఆంబ్రోస్ ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 15 బంతులు వేసిన రికార్డును కలిగి ఉన్నాడు. 1997లో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో, కర్ట్లీ ఆంబ్రోస్ ఒక ఓవర్‌లో మొత్తం 15 బంతులు బౌలింగ్ చేశాడు, ఆ సమయంలో కర్ట్లీ ఆంబ్రోస్ 9 నో బాల్స్ వేశాడు.

4. డారిల్ టఫీ (న్యూజిలాండ్): 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డారిల్ టఫీ ఒకే ఓవర్‌లో 14 బంతులు వేశాడు. ఈ కాలంలో న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డారిల్ టఫీ 4 వైడ్ బాల్స్, 4 నో బాల్స్ వేశాడు.

5. స్కాట్ బోస్‌వెల్ (ఇంగ్లాండ్): 2001లో లీసెస్టర్‌షైర్ తరపున ఆడుతున్నప్పుడు సోమర్‌సెట్‌తో జరిగిన సీ అండ్ జీ ట్రోఫీ మ్యాచ్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోస్‌వెల్ ఒకే ఓవర్‌లో 14 బంతులు వేశాడు. ఇంగ్లాండ్ తరపున ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన బౌలర్ కూడా ఇతనే.



















