IND vs WI: విండీస్‌తో సిరీస్‌లో రోహిత్‌కు జోడీగా ఆ యంగ్ సెన్సేషన్.. మిడిలార్డర్‌లో రానున్న శుభ్‌మన్ గిల్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో భంగపాటుకు గురైన భారత జట్టు త్వరలో విండీస్ పర్యటనకు బయలుదేరనుంది. అక్కడ రెండు టెస్టులతో పాటు వన్డేలు, టీ20లు ఆడనుంది. కాగా కరేబియన్ సిరీస్‌తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఎడిషన్ 3 వేట మొదలెట్టనుంది టీమిండియా.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో భంగపాటుకు గురైన భారత జట్టు త్వరలో విండీస్ పర్యటనకు బయలుదేరనుంది. అక్కడ రెండు టెస్టులతో పాటు వన్డేలు, టీ20లు ఆడనుంది. కాగా కరేబియన్ సిరీస్‌తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఎడిషన్ 3 వేట మొదలెట్టనుంది టీమిండియా. కాగా ఈ సిరీస్ కోసం బీసీసీఐ పలువురు యువ ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టులో ఐపీఎల్‌లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ వంటి యంగ్ ప్లేయర్లు కూడా ప్లేస్ దక్కించుకున్నారు. కాగా టీమ్ ఇండియాలో ఇప్పుడు మొత్తం నలుగురు ఓపెనర్లు ఉన్నారు. వీరిలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇప్పటికే జట్టులో ఉండగా.. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ క్రమంలో విండీస్‌తో ఎవరు ఓపెనింగ్ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే రోహిత్ శర్మతో పాటు యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్‌కు దిగుతారని తెలుస్తోంది. కాగా ఈ సిరీస్‌కు మిడిలార్డర్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా దూరమయ్యాడు. కాబట్టి మిడిలార్డర్‌లో క్రీజులో దూసుకుపోయే సత్తా ఉన్న బ్యాటర్ టీమిండియాకు అవసరం. ఈక్రమంలో శుభమాన్ గిల్ లాంటి ఆటగాడు ఉంటే మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతమవుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
శుభ్‌మన్ గిల్ మిడిలార్డర్‌లో నమ్మదగిన బ్యాటర్. ఇప్పటికే తన డిఫెన్సివ్ ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అందుకే పుజారా స్థానంలో గిల్‌ను రంగంలోకి దింపుతారని తెలుస్తోంది. యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా దింపడం ద్వారా శుభ్‌మన్ గిల్‌తో ప్రయోగాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఓపెనర్ రోహిత్ శర్మ కుడిచేతి వాటం బ్యాటర్ కాగా, జైస్వాల్ ఎడమ చేతి వాటం ఆటగాడు. దీని ద్వారా టీమ్ ఇండియా మరోసారి రైట్ హ్యాండ్-లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్‌ను ప్రయత్నించనుంది. ఒకవేళ జైస్వాల్ ఓపెనర్‌గా కుదురుకుంటే శుభ్‌మన్ గిల్ వన్ డౌన్ లేదా నాలుగో ప్లేయర్‌గా పర్మనెంట్‌గా ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
టెస్ట్ సిరీస్ షెడ్యూల్
- మొదటి టెస్ట్ – జూలై 12 నుండి 16 వరకు, డొమినికా
- రెండవ టెస్ట్ – జూలై 20 నుండి 24 వరకు, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
భారత టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..