AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఆజామూ.. నువ్వో చెత్త ప్లేయర్.. నేపాల్ టీంలోనూ నీకు ప్లేస్ వేస్ట్: విమర్శలు గుప్పించిన పాక్ ప్లేయర్

Shoaib Malik Slameed Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు చెడు దశ ఇంకా ముగిసిపోలేదు. జట్టు ప్రదర్శన నిరంతరం క్షీణిస్తోంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో కూడా పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన చాలా యావరేజ్‌గా ఉంది. అమెరికా, భారత్ చేతిలో ఓడి గ్రూప్ దశలోనే ఆ జట్టు నిష్క్రమించింది. పాక్‌ ఓటమి తర్వాత ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది.

Video: ఆజామూ.. నువ్వో చెత్త ప్లేయర్.. నేపాల్ టీంలోనూ నీకు ప్లేస్ వేస్ట్: విమర్శలు గుప్పించిన పాక్ ప్లేయర్
Babar Azam Controversy
Venkata Chari
|

Updated on: Jul 03, 2024 | 12:46 PM

Share

Shoaib Malik Slameed Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు చెడు దశ ఇంకా ముగిసిపోలేదు. జట్టు ప్రదర్శన నిరంతరం క్షీణిస్తోంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో కూడా పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన చాలా యావరేజ్‌గా ఉంది. అమెరికా, భారత్ చేతిలో ఓడి గ్రూప్ దశలోనే ఆ జట్టు నిష్క్రమించింది. పాక్‌ ఓటమి తర్వాత ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. బాబర్ ఆజంపై పలువురు మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శల మధ్య పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్ బాబర్ ఆజంను ఘోరంగా అవమానించాడు.

బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించిన షోయబ్ మాలిక్..

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో షోయబ్ మాలిక్ టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడుతున్నట్లు కనిపించింది. తన సంభాషణలో, అతను పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై మాటలతో దాడి చేశాడు.

షోయబ్ మాట్లాడుతూ, ‘మా అత్యుత్తమ ఆటగాడు ఎవరు? మా అత్యుత్తమ ఆటగాడు బాబర్ ఆజం. నేను ప్రపంచ క్రికెట్‌లోని టాప్ 4-5 జట్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. బాబర్ వీరికి సరిపోతాడా? ఒకవేళ బాబర్‌ను ప్లేయింగ్ 11లో చేర్చవలసి వస్తే.. ఆస్ట్రేలియన్ జట్టులో చేర్చాలి. ఇంగ్లండ్ లేదా భారత జట్టులో చేర్చాలి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో మాత్రం సమాధానం లేదు. నేపాల్ జట్టు కూడా తమ జట్టులో బాబర్ అజామ్‌కు చోటు కల్పించలేదు’ అంటూ షాకిచ్చాడు.

వీడియో..

కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా బాబర్ అజామ్‌కు టీ20 ప్రపంచకప్ చాలా చెడ్డదిగా మారింది. బాబర్ 4 మ్యాచ్‌లలో 101.66 సాధారణ స్ట్రైక్ రేట్‌తో 122 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో బాబర్‌ ఆజం హాఫ్‌ సెంచరీ కూడా చేయలేకపోయాడు. టీ20 ప్రపంచ కప్ వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బాబర్ అజామ్ స్ట్రైక్ చాలా తక్కువగా ఉంది. అతని స్ట్రైక్ రేట్ టోర్నమెంట్ అంతటా నిరంతరం విమర్శలకు గురైంది.

బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీ విషయానికొస్తే.. అమెరికాలాంటి కొత్త జట్టు చేతిలో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత, పాకిస్తాన్ జట్టు తన చిరకాల ప్రత్యర్థి భారత్‌పై 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సాధించలేకపోయింది. తొలి రెండు వరుస మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించడం అప్పటికే ఖరారైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..