Shardul Thakur IPL 2022 Auction: ధోని శిష్యుడిపై కాసుల వర్షం.. రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ..

Shardul Thakur Auction Price: ఐపీఎల్ వేలంలో టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్‌ను రూ. 10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఈ మెగా వేలంలో వరుసగా టీమిండియా

Shardul Thakur IPL 2022 Auction: ధోని శిష్యుడిపై కాసుల వర్షం.. రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ..
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Feb 12, 2022 | 6:55 PM

Shardul Thakur Auction Price: ఐపీఎల్ వేలంలో టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్‌ను రూ. 10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఈ మెగా వేలంలో వరుసగా టీమిండియా ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడుపోతుండటం విశేషం. ఇటీవల కాలంలో భారత్ జట్టు విజయాల్లో శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఐపీఎల్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఠాకూర్.. జట్టు క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు అటు వికెట్లు తీయడమే కాకుండా.. బ్యాటింగ్‌లోనూ ఫినిషర్‌గా వేగంగా పరుగులు సాధించాడు.

Shardul Thakur

శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ కెరీర్ ఒకసారి పరిశీలిస్తే.. 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఠాకూర్‌ను దక్కించుకోగా.. 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కింది. అప్పుడు నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఆ తర్వాత 2017లో పూణే సూపర్ జెయింట్స్ శార్దూల్‌ను దక్కించుకుంది. ఇక 2018లో చెన్నైలోకి వచ్చిన సీఎస్‌కే.. ఆ నెక్స్ట్ సీజన్‌లోనే ఆ జట్టు ఫైనల్‌లో గెలుపొందేందుకు కీలక పాత్ర పోషించాడు. లాస్ట్ ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి చెన్నైకు ట్రోఫీ అందించాడు. అలాగే 2021 సీజన్‌లోనూ ఠాకూర్‌ కీలక ఇంటర్వెల్స్‌లో వికెట్లు పడగొట్టాడు. విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఆ జట్టుకు ఆ సీజన్‌లో లీడింగ్ వికెట్ టేకర్. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు.

Read Also: IPL 2022 Auction, Day 1, Live: ఇషాన్ కిషన్‌పై కాసుల వర్షం.. ఐపీఎల్ మెగాలో సరికొత్త మెరుపులు..