Team India: 34 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 230 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లను చీల్చి చెండాడిన టీమిండియా బ్యాటర్..
India Women U19 vs United Arab Emirates Women U19: 18 ఏళ్ల షెఫాలీ వర్మ యూఏఈ మహిళల జట్టుపై 34 బంతుల్లో హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి భారత విజయాన్ని ఖాయం చేసింది.
India Women U19 vs United Arab Emirates Women U19: ప్రస్తుతం సౌతాఫ్రికాలో మహిళల అండర్-19 ప్రపంచకప్ జరుగుతోంది. షెఫాలీ వర్మ నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగింది. సారథిగా మారినప్పటి నుంచి తన ఆటలోనూ వేగం పెరిగింది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన షెఫాలీ.. రెండో మ్యాచ్‌లోనూ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. యూఏఈపై 34 బంతుల ఇన్నింగ్స్‌తో పరుగుల వర్షం కురిపించింది.
18 ఏళ్ల షెఫాలీ వర్మ యూఏఈ మహిళల జట్టుపై 34 బంతుల్లో ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయాన్ని ఖాయం చేసింది. ఈ తుఫాను ఇన్నింగ్స్‌తో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసింది. అనంతరం యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 97 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
34 బంతుల్లో 78 పరుగులు.. 12 ఫోర్లు, 4 సిక్సర్లు..
భారత్‌ను 219 పరుగులకు చేర్చడంలో కెప్టెన్ షెఫాలీ వర్మ గొప్ప సహకారం అందించింది. కేవలం 34 బంతుల్లో 78 పరుగులు చేసింది. దాదాపు 230 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల వర్షం కురిపించింది.
షెఫాలీ ఆరో అర్ధ సెంచరీ..
#TeamIndia skipper @TheShafaliVerma has raced to 6️⃣7️⃣* off just 3️⃣0️⃣ deliveries!
What a solid start for India as we move to 97/0 after 7.5 overs ?
Follow the match ▶️ https://t.co/lhJAqEEm4Y… #TeamIndia | #INDvUAE | #U19T20WorldCup pic.twitter.com/J1h69DQupD
— BCCI Women (@BCCIWomen) January 16, 2023
టీ20 క్రికెట్‌లో షఫాలీ వర్మ ఆరో అర్ధ సెంచరీ పూర్తి చేసింది. ఇందుకోసం కేవలం 26 బంతులను ఉపయోగించుకుంది. అంతకుముందు, చివరి రెండు టీ20ల్లో, షెఫాలీ రెండుసార్లు హాఫ్ సెంచరీకి చేరువైనప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోయింది. బంగ్లాదేశ్ మహిళల జట్టుపై 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై 45 పరుగులు చేసింది. వరుసగా రెండుసార్లు తప్పుకోవడంతో మూడోసారి ఎలాంటి తడబాటు లేకుండా అర్ధసెంచరీ పూర్తి చేసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..