Sanju Samson : కేరళ లీగ్ ఆక్షన్లో సంజు శాంసన్ రికార్డ్.. కోచ్చి బ్లూ టైగర్స్ ఎంతకు కొన్నదో తెలుసా ?
ఒకప్పుడు టీం ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంజు శాంసన్ కేరళ క్రికెట్ లీగ్ ఆక్షన్‌లో రూ.26.60 లక్షలతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కోచ్చి బ్లూ టైగర్స్ అతన్ని కొనుగోలు చేసింది. అతని కెరీర్ లీగ్‌లోని ఇతర ఖరీదైన ఆటగాళ్ల వివరాలు తెలుసుకుందాం.

Sanju Samson : భారత క్రికెట్‌లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్, కేరళ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్. కేరళ క్రికెట్ లీగ్ రెండో సీజన్‌లో సంజు శాంసన్ మొదటిసారి ఆడబోతున్నాడు. ఈ లీగ్ వేలంలో సంజు శాంసన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కోచ్చి బ్లూ టైగర్స్ జట్టు తమ మొత్తం డబ్బులో సగానికి పైగా ఖర్చు చేసి సంజును కొనుగోలు చేసింది. ఈ భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ను కోచ్చి జట్టు రూ.26.60 లక్షలకు కొని, లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మార్చింది. మొదట సంజును రూ.3 లక్షల బేస్ ప్రైస్‌కు లిస్ట్ చేశారు.. కానీ చూస్తుండగానే అతని ధర రూ.5 లక్షలు, ఆపై రూ.10 లక్షలు దాటింది. చివరికి కోచ్చి జట్టు రికార్డు ధరకు అతన్ని దక్కించుకుంది. కోచ్చికి ఉన్న రూ.50 లక్షల బడ్జెట్లో సగానికి పైగా మొత్తాన్ని సంజును కొనడానికి ఖర్చు చేసింది.
2024 డిసెంబర్‌లో వాయనాడ్‌లో జరిగిన ప్రిపరేషన్ క్యాంపుకు హాజరుకాకపోవడం వల్ల విజయ్ హజారే ట్రోఫీ జట్టు నుండి సంజు శాంసన్‌ను తొలగించారు. ఆ తర్వాత సంజు కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే టోర్నమెంట్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. గతేడాది సంజు తన ఇంటర్నేషనల్ కమిట్‌మెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి, కేరళ లీగ్ మొదటి సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే అతడిని లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. అయినా కూడా సంజూ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
సంజు శాంసన్ ఇటీవల ఐపీఎల్ 2025లో కూడా ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజు తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 285 పరుగులు చేశాడు. పూర్తిగా ఫిట్‌గా లేకపోవడం వల్ల ఐపీఎల్‌లో అతను కొన్ని మ్యాచ్‌లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాడు. సంజు సహచరుడైన విష్ణు వినోద్‌ను ఏరిస్ కొల్లాం జట్టు రూ.13.8 లక్షలకు కొనుగోలు చేసింది. అతను లీగ్‌లో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కేరళ తరపున ప్రొఫెషనల్ ఆటగాడిగా ఆడుతున్న అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనాను అలెప్పి రిపుల్స్ జట్టు రూ.12.4 లక్షలకు దక్కించుకుంది.
శాంసన్ భారతదేశం తరపున 16 వన్డే మ్యాచ్‌లు ఆడి, ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 510 పరుగులు చేశాడు. అలాగే, 42 టీ20 మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో కలిపి 861 పరుగులు చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..