Sania Mirza-Shoaib Malik: త్వరలోనే సానియా-షోయబ్ విడాకులు ప్రకటించే ఛాన్స్.. జాప్యం అందుకేనంట?
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ త్వరలో విడాకులు తీసుకోవచ్చు. దీనికి సంబంధించి మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు వార్తల్లో నిలుస్తోంది. త్వరలో సానియా, షోయబ్ విడాకులు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. చట్టపరమైన సమస్యలను పరిష్కరించిన తర్వాత సానియా, షోయబ్ విడాకులు ప్రకటిస్తారని పాకిస్థాన్ న్యూస్ ఛానెల్ జియో వర్గాలు తెలిపాయి. దాదాపు 12 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పే దిశగా ఇద్దరూ ముందుకొచ్చారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఇరువర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
విడాకుల వార్తలపై సానియా, షోయబ్ ఇంకా మాట్లాడలేదు. కానీ, సన్నిహితుల సమాచారం ప్రకారం, వారు న్యాయపరమైన అంశాల గురించి చర్చిస్తున్నారు. ఇది పరిష్కరించబడిన తర్వాత, విడాకులు ప్రకటించవచ్చని తెలుస్తోంది. వారిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. బహుశా ఇద్దరూ కొడుకు ఇజాన్ బాధ్యతలు నిర్వహిస్తారని అంటున్నారు. ఇజాన్ వయస్సు దాదాపు 4 సంవత్సరాలు.
పాక్ మీడియాలో జరుగుతున్న వార్తల ప్రకారం షోయబ్ సానియాను మోసం చేస్తున్నాడని, అతను వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ విషయం విడాకుల దాకా వెళ్లేంతగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇద్దరూ దాదాపు 12 ఏళ్ల బంధానికి ముగింపు పలికే దశకు చేరుకున్నారు. ప్రధాన విషయం ఏమిటంటే, ఈ విషయంపై ఇద్దరూ ఇంతవరకు స్పందించలేకపోవడం గమనార్హం.
విశేషమేమిటంటే, భారత స్టార్ టెన్నిస్ దిగ్గజం సానియా.. షోయబ్ మాలిక్‌ను 2010లో వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లి బాగా పాపులర్ అయింది. షోయబ్ వివాహం కోసం భారతదేశానికి వచ్చి హైదరాబాదీ ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో వలీమే నిర్వహించారు. సానియా 2018లో తన కొడుకు ఇజాన్‌కు జన్మనిచ్చింది. షోయబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఈ శుభవార్త అందించాడు. అయితే ఆ తరువాత, షోయబ్, సానియా మధ్య సంబంధం దెబ్బతింది. ఈ విషయం ఇప్పుడు విడాకుల వరకు చేరుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..