AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: రాజస్థాన్ కొంపముంచిన ఆ ఒక్క ఓవర్.. చెత్త రికార్డుల లిస్ట్ లో మొత్తం మనోళ్లే!

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క ఓవర్‌లో 11 బంతులు వేసి, అత్యధిక బంతులు వేసిన భారత బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. నో బాల్స్, వైడ్‌లు వరుసగా వేసిన సందీప్, ఢిల్లీ జట్టుకు పెద్ద స్కోరు చేయడానికి దారి తీసాడు. ఈ ఓవర్ అతని కెరీర్‌లో చెరగని ముద్ర వేసింది.

IPL 2025: రాజస్థాన్ కొంపముంచిన ఆ ఒక్క ఓవర్.. చెత్త రికార్డుల లిస్ట్ లో మొత్తం మనోళ్లే!
Sandeep Sharma Rr
Narsimha
|

Updated on: Apr 17, 2025 | 12:20 PM

Share

ఐపీఎల్ 2025 సీజన్ రోజురోజుకీ మరింత ఉత్కంఠభరితంగా మారుతున్న తరుణంలో, ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన 32వ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ వేదికగా అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఈ పోరులో, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా చాలా రసవత్తరమైన ఘటనలు జరిగాయి. అయితే, ఈ మ్యాచ్‌లో అత్యంత దృష్టిని ఆకర్షించిన విషయం రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ వేసిన విచిత్రమైన ఓవర్. సందీప్ చివరి ఓవర్‌లో మొత్తం 11 బంతులు వేసి, ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన భారత బౌలర్ల అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఈ జాబితాలో ఇప్పటికే మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్‌పాండే, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు.

మ్యాచ్ మొదట్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తక్కువ స్కోరుకు పరిమితమవుతుందేమో అనిపించింది. మెక్‌గుర్క్ 9 పరుగులకే ఔటవగా, కరుణ్ నాయర్ మూడు బంతుల్లో డకౌట్ అయ్యాడు. అభిషేక్ పోరెల్ కొంత మెరుగైన ఆటతీరు కనబర్చినా, ఆఖరుకు 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. కెఎల్ రాహుల్ 38 పరుగులతో నిలదొక్కుకున్నాడు. తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (34 నాటౌట్), కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34) భారీ బాణసంచా ప్రదర్శించి జట్టును బలమైన స్థితికి చేర్చారు. ఈ ప్రదర్శనతో ఢిల్లీ 188/5 స్కోరు చేసింది.

ఇక దాని తర్వాత వచ్చిన మలుపే సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్. మొదటి బంతిని వైడ్ వేసిన సందీప్, ఆ తర్వాత డాట్ బంతి వేసినా, వెంటనే వరుసగా మూడు వైడ్‌లు వచ్చాయి. తదనంతరం నో బాల్ వేసి, ఫ్రీ హిట్‌ను అశుతోష్ శర్మ బౌండరీకి పంపాడు. ఇలా అదనపు పరుగులు వరుసగా పెరుగుతూ, ఒత్తిడిలో సందీప్ పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయాడు. ఈ ఓవర్ మొత్తం 11 బంతులు సాగడం తో పాటు, ఢిల్లీకి ఫినిషింగ్ పంచ్ ఇచ్చింది. ఇదే కారణంగా అతను ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన భారత బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. ఈ అరుదైన ఫీట్ ఇప్పటివరకు మహ్మ్మద్ సిరాజ్ (2023, ముంబైపై), తుషార్ దేశ్‌పాండే (2023, LSGపై), శార్దూల్ ఠాకూర్ (2025, KKRపై) చేయగా, ఇప్పుడు సందీప్ శర్మ కూడా (2025, ఢిల్లీపై) ఆ జాబితాలో నిలిచాడు.

ఈ మ్యాచ్ సందీప్ శర్మకు మరచిపోలేని అనుభవంగా మిగిలిందనడంలో ఎటువంటి సందేహం లేదు. బౌలింగ్‌లో అద్భుతతను కాకుండా, అదుపు కోల్పోయిన ఈ ఓవర్ అతని కెరీర్‌లో ఓ ముద్ర వేసిందనే చెప్పాలి.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి