Sachin Tendulkar: ‘సచిన్ సార్.. మీరు నిజంగా దేవుడు’.. వేలాది మంది పిల్లల పెదాలపై చిరునవ్వు కోసం.. వీడియో

అంతర్జాతీయ క్రికెట్ లో లెక్కలేనన్నీ రికార్డులు, అద్భుతాలు సాధించిన సచిన్‌ టెండూల్కర్‌ రిటైర్‌ అయ్యాక తన వంతు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 'సచిన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేద పిల్లలు, చిన్నారులకు, విద్యార్థులకు తన వంతు చేయూతనిస్తున్నారు.

Sachin Tendulkar: సచిన్ సార్.. మీరు నిజంగా దేవుడు.. వేలాది మంది పిల్లల పెదాలపై చిరునవ్వు కోసం.. వీడియో
Sachin Tendulkar

Updated on: Mar 01, 2024 | 4:52 PM

సచిన్ టెండూల్కర్.. క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చి సుమారు పదేళ్లు గడిచినా ఈ పేరుకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను తన ఖాతాలో వేసుకుని ‘క్రికెట్ ఆఫ్ గాడ్’ గా మారిపోయాడు సచిన్. ఆటకు మించి మాస్టర్ బ్లాస్టర్ క్రమశిక్షణ, ఆట పట్ల అంకిత భావం ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో లెక్కలేనన్నీ రికార్డులు, అద్భుతాలు సాధించిన సచిన్‌ టెండూల్కర్‌ రిటైర్‌ అయ్యాక తన వంతు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ‘సచిన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేద పిల్లలు, చిన్నారులకు, విద్యార్థులకు తన వంతు చేయూతనిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో ప్రతి ఏడాది దాదాప 60 వేల మంది చిన్నారులు పెదవి సంబంధిత వైకల్యంతో జన్మిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆపరేషన్లు చేయించి వారి పెదవులపై చిరునవ్వును తెప్పిస్తున్నారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక అద్భుత మైన వీడియోను షేర్ చేసుకున్నారాయన. శస్త్రచికిత్సకు ముందు, తర్వాత పిల్లలు ఎలా మారిపోయారో చూపే వీడియోను అందులో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మేమంతా హ్యాపీగా ఫీలవుతున్నాం.

ప్రస్తుం జమ్మూ కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు సచిన్ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా భార్య అంజలి, కూతురు సారాతో కలిసి స్థానికంగా ఉన్నా ఇంగా హెల్త్ ఫౌండేషన్ ఆస్పత్రిని ను సందర్శించారు సచిన్. అక్కడ పెదవి సంబంధిత వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తారు. ఈ ఆస్పత్రికి తన ఫౌండేషన్ తరఫున అన్ని రకాలుగా సాయమందిస్తున్నారు సచిన్‌. ‘ పెదాలపై చిరునవ్వు అనేది మనకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి. చాలా మందికి ఈ వరం దక్కదు. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 60,000 మంది పిల్లలు పెదవి సంబంధిత వైకల్యాలతో పుడుతున్నారు. అలాంటి పిల్లల పెదాలపై తిరిగి చిరునవ్వును తెప్పించేందుకు సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాం. ఇందుకోసంఅద్భుతమైన వైద్యులతో కలిసి మేం పని చేస్తున్నాం. మా జమ్మూ & కాశ్మీర్ పర్యటనలో, మేము ఇంగా హెల్త్ ఫౌండేషన్ ఆసుపత్రిలో వైద్యులు, పిల్లలు వారి తల్లిదండ్రులతో మాట్లాడాం. శస్త్రచికిత్స ఈ పిల్లల జీవితాలను ఎలా మార్చిందో కథలు వినడం నిజంగా సంతోషాన్నిచ్చింది. ఈ చిన్న హీరోలను కలిసిన తర్వాత అంజలి, సారా, నేను అందరం ఎంతో ఆనందంగా ఫీలయ్యాం. వారి జీవితాల్లో ఈ అందమైన మార్పుకు సహకరించినందుకు మేము సంతోషిస్తున్నాం’ అని సచిన్ ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో సచిన్, అంజలి, సారా..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..