AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ప్రపంచంలోనే డేంజరస్ బౌలర్స్.. కట్‌చేస్తే.. 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 98 పరుగులు.. పాక్‌ను చిత్తుగా బాదిన లిటిల్ మాస్టర్..

Sachin Tendulkar: తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 273 పరుగుల భారీ స్కోరు సాధించింది. సయీద్ అన్వర్ 101 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును సవాలుతో కూడిన స్కోరుకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో, పాకిస్తాన్ జట్టులో వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ రూపంలో ప్రపంచంలోనే ముగ్గురు అత్యంత ప్రమాదకరమైన బౌలర్లు ఉన్నారు. ఈ కారణంగా ఈ లక్ష్యం చాలా పెద్దదిగా కనిపించింది. అయితే సచిన్‌, సెహ్వాగ్‌ల ఉద్దేశం వేరుగా కనిపించింది.

Video: ప్రపంచంలోనే డేంజరస్ బౌలర్స్.. కట్‌చేస్తే.. 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 98 పరుగులు.. పాక్‌ను చిత్తుగా బాదిన లిటిల్ మాస్టర్..
Sachin Vs Pak 2003
Venkata Chari
|

Updated on: Mar 01, 2024 | 1:43 PM

Share

On This Day: 1 మార్చి 2003, ప్రతి భారతీయ క్రికెట్ ప్రేమికుడు ఇప్పటికీ గుర్తుంచుకునే రోజు. ఇది చాలా కాలం పాటు గుర్తుంచుకోవాలని కోరుకుంటుంటారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల గురించి మాట్లాడినప్పుడల్లా, ఈ మ్యాచ్ ఖచ్చితంగా ప్రస్తావనకు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్‌లో మకుటం లేని రారాజుగా ఎందుకు మారాడో ప్రపంచానికి చాటి చెప్పిన ఇన్నింగ్స్‌గా మారింది. అతను దాదాపు ఒంటిచేత్తో పాకిస్తాన్ ప్రమాదకరమైన బౌలింగ్‌ను చిత్తుగా ఓడించాడు. షోయబ్ అక్తర్, వకార్ యూనిస్ వంటి బౌలర్లను పొట్టుపోట్టుగా కొట్టేశాడు. షోయబ్ అక్తర్ బంతిపై సచిన్ టెండూల్కర్ కొట్టిన సిక్సర్‌ను చూస్తే ఇప్పటికీ ఫిదా అవ్వా్ల్సిందే.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 273 పరుగుల భారీ స్కోరు సాధించింది. సయీద్ అన్వర్ 101 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును సవాలుతో కూడిన స్కోరుకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో, పాకిస్తాన్ జట్టులో వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ రూపంలో ప్రపంచంలోనే ముగ్గురు అత్యంత ప్రమాదకరమైన బౌలర్లు ఉన్నారు. ఈ కారణంగా ఈ లక్ష్యం చాలా పెద్దదిగా కనిపించింది. అయితే సచిన్‌, సెహ్వాగ్‌ల ఉద్దేశం వేరుగా కనిపించింది. వీరిద్దరూ 5.4 ఓవర్లలో 53 పరుగుల శుభారంభం భారత జట్టుకు అందించారు. సెహ్వాగ్ 14 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటయ్యాడు.

కేవలం 75 బంతుల్లో 98 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్..

అయితే, సచిన్ టెండూల్కర్ కేవలం 75 బంతుల్లో 98 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ఈ లక్ష్యాన్ని చాలా చిన్నదిగా మార్చేశాడు. సచిన్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. దురదృష్టవశాత్తు సచిన్ తన సెంచరీని పూర్తి చేయలేకపోయాడు. కానీ ఖచ్చితంగా భారత జట్టును విజేత స్థానానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ 44 నాటౌట్, యువరాజ్ సింగ్ 50 పరుగులతో రాణించడంతో కేవలం 45.4 ఓవర్లలోనే టీమిండియా విజయాన్ని అందుకుంది. తద్వారా ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ మరో విజయాన్ని అందుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు