Mohammed Shami: మహ్మద్ షమీకి అండగా నిలిచిన సచిన్.. జట్టును సపోర్ట్ చేస్తే అందులోని ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసినట్లే..

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి మద్దతుగా నిలిచాడు. టీం ఇండియాను సపోర్ట్ చేయడం అంటే అందులో ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయడమేనని ట్వీట్ చేశాడు...

Mohammed Shami: మహ్మద్ షమీకి అండగా నిలిచిన సచిన్.. జట్టును సపోర్ట్ చేస్తే అందులోని ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసినట్లే..
Sachin
Follow us

|

Updated on: Oct 26, 2021 | 1:46 PM

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి మద్దతుగా నిలిచాడు. టీం ఇండియాను సపోర్ట్ చేయడం అంటే అందులో ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయడమేనని ట్వీట్ చేశాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‎కు పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి భారత ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమీనే కారణమంటూ కొందరు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. షమీ పాక్‌కు అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై మాజీ ఆటగాళ్లు షమీకి మద్దతుగా నిలిచారు. “మేము ఇండియాకి మద్దతు ఇచ్చినప్పుడు, మేము టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించే ప్రతి వ్యక్తికి మద్దతు ఇస్తాము. షమీ నిబద్ధతగల, ప్రపంచ స్థాయి బౌలర్. నేను షమీ అండ్ టీమ్ ఇండియాకు వెన్నుదన్నుగా నిలుస్తాను” అని టెండూల్కర్ అన్నారు. వీరేంద్ర సెహ్వాగ్, మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ షమీకి మద్దతు తెలిపారు.

మాజీ బౌలర్ హర్భజన్ సింగ్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ షమీకి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ షమీని దుర్భాషలాడిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విమర్శించడం మంచిది కానీ ఖిలాడియోం కో దుర్వినియోగం నహీ కర్నా చాహియే. యే గేమ్ హై, ఆ రోజు మెరుగైన జట్టు గెలిచింది. ఇన్హి క్రికెటర్స్ నే ఇండియా కో బోహోట్ మ్యాచ్‌లు జితయే హై పిచ్లే కుచ్ సాలోన్ మే. హర్ హర్ కర్ జీత్నే వాలే కో హి బాజిగర్ కెహతే హై నా! నేను కూడా మేము ఓడిపోయిన మైదానంలో ఇండియా, పాక్ యుద్ధాలలో భాగమయ్యాను, కానీ పాకిస్తాన్‌కు వెళ్లమని ఎప్పుడూ చెప్పలేదు! నేను కొన్ని సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతున్నాను. అంటూ ట్వీట్ చేశాడు.

భారత మాజీ బ్యాట్స్‌మెన్ VVS లక్ష్మణ్ షమీని సపోర్ట్ చేశాడు. ఫాస్ట్ బౌలర్, భారత జట్టుకు మద్దతు ఇవ్వాలని అభిమానులను కోరారు. మహమ్మద్ షమీ ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశానికి అద్భుతమైన సేవ చేస్తున్నాడు. అనేక విజయల్లో గొప్ప పాత్ర పోషించాడని చెప్పాడు. ఒక్క ఆటతో అతడిని నిర్వచించలేం. నా మద్దతు అతనికి ఎప్పుడూ ఉంటుందని తెలిపాడు.

Read Also.. T20 World Cup 2021: స్కాట్లాం‎డ్‎పై ఆఫ్ఘాన్ ఘన విజయం.. రాణించిన రెహమాన్, రషీద్ ఖాన్..