T20 Cricket: ఇదెక్కడి మ్యాచ్‌ రా బాబు.. 46 ఫోర్లు, 35 సిక్సులతో 517 పరుగులు.. టీ20ల్లో బద్దలైన ప్రపంచ రికార్డ్..

SA vs WI T20I Match Records: సెంచూరియన్‌లో ఆదివారం (మార్చి 26) రాత్రి దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో అనేక రికార్డులు బద్దలయ్యాయి.

T20 Cricket: ఇదెక్కడి మ్యాచ్‌ రా బాబు.. 46 ఫోర్లు, 35 సిక్సులతో 517 పరుగులు.. టీ20ల్లో బద్దలైన ప్రపంచ రికార్డ్..
Sa Vs Wi T20i Records
Follow us
Venkata Chari

|

Updated on: Mar 27, 2023 | 3:58 PM

South Africa vs West Indies: సెంచూరియన్‌లో ఆదివారం (మార్చి 26) రాత్రి దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 258 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక్కడ దక్షిణాఫ్రికా జట్టు మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫోర్లు-సిక్స్‌ల వర్షం కురిపించిన తీరు టీ20 క్రికెట్‌లోని ఎన్నో రికార్డులను బ్రేక్ చేసేసింది.

టీ20 క్రికెట్‌లో అతిపెద్ద లక్ష్యాన్ని (259) ఛేదించే జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా (244) పేరిట ఉంది.

ఈ మ్యాచ్‌లో మొత్తం 517 పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ ఇప్పుడు టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల మ్యాచ్‌గా మారింది. అంతకుముందు, PSL 2023లో ముల్తాన్ సుల్తాన్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 515 పరుగులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా తన టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపెద్ద స్కోరు (259) చేసింది. అంతకుముందు ఈ ఫార్మాట్‌లో ప్రొటీస్ జట్టు అత్యధిక స్కోరు 241 పరుగులను సాధించింది.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తమ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపెద్ద స్కోరు (258) కూడా చేసింది. అంతకుముందు టీ20లో విండీస్ జట్టు అత్యధిక స్కోరు (245) సాధించింది.

ఈ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు (81) నమోదయ్యాయి. ఇందులో 46 ఫోర్లు, 35 సిక్సులున్నాయి. అంతకుముందు, ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన పీఎస్‌ఎల్ 2023 మ్యాచ్‌లో 78 బౌండరీలు వచ్చాయి.

ఈ మ్యాచ్‌లో మొత్తం 35 సిక్సర్లు బాదడం ఒక టీ20 మ్యాచ్‌లో అత్యధికంగా నిలిచింది. అంతకుముందు బల్గేరియా-సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్‌లో 33 సిక్సర్లు నమోదయ్యాయి.

ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్ 22 సిక్సర్లు బాదారు. ఒక టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టు జాబితాలో ఈ రికార్డు సంయుక్తంగా నంబర్ వన్ స్థానంలో ఉంది. 2019లో ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 22 సిక్సర్లు కొట్టింది.

ఈ మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికా తరపున అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన రికార్డును (17 బంతుల్లో) తానే బద్దలు కొట్టాడు.

దక్షిణాఫ్రికా 5.3 ఓవర్లలో 100 పరుగులు చేసింది. టీ20 ఇంటర్నేషనల్‌లో పూర్తి సభ్య దేశాల్లో ఇది వేగవంతమైన 100 పరుగులుగా నిలిచింది.

వెస్టిండీస్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది ఉమ్మడి నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!