RSA vs AUS: దటీజ్ కెప్టెన్ బావుమా.. 100 ఏళ్లలో ఏ కెప్టెన్ సాధించలేని రికార్డులో ఒకే ఒక్కడిగా..
WTC 2025: ఈ టైటిల్ విజయంలో, కెప్టెన్ టెంబా బాబూమా గత 100 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో ఏ కెప్టెన్ సాధించనిది సాధించాడనడంలో సందేహం లేదు. అత్యంత అవసరమైన సమయంలో టెంబా ఇన్నింగ్స్ 66 పరుగులు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మార్క్రామ్‌తో మూడవ వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం విజయానికి కీలకంగా మారాయి.

South Africa vs Australia, WTC 2025 Final: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు “చోకర్స్” అనే అపవాదు ఎప్పటినుంచో అంటుకుంది. ఐసీసీ టోర్నమెంట్లలో కీలక సమయాల్లో ఒత్తిడికి గురై ఓడిపోవడం వారికి పరిపాటిగా మారింది. అలాంటి చరిత్ర ఉన్న జట్టు, క్రికెట్ ప్రపంచంలో అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ఓడించి టైటిల్ గెలుచుకోవడం ఒక అద్భుతమైన ఘట్టం. ఈ విజయం వెనుక కెప్టెన్ టెంబా బావుమా అసాధారణ పోరాటం, అకుంఠిత దీక్ష ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ కంగారూల గర్వాన్ని దెబ్బతీసింది. ఫైనల్ మ్యాచ్‌లో నాల్గవ రోజున ఆసీస్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా ఏ ఫార్మాట్‌లోనైనా తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఘనతను సాధించింది.
100 ఏళ్ల హిస్టరీలో ఒకే ఒక్కడు..
ఈ టైటిల్ విజయంలో, కెప్టెన్ టెంబా బాబూమా గత 100 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో ఏ కెప్టెన్ సాధించనిది సాధించాడనడంలో సందేహం లేదు. అత్యంత అవసరమైన సమయంలో టెంబా ఇన్నింగ్స్ 66 పరుగులు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మార్క్రామ్‌తో మూడవ వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం విజయానికి కీలకంగా మారాయి. చరిత్రలో గొప్ప కెప్టెన్లు కూడా వారి పేరు మీద నమోదు చేయలేకపోయిన ఓ రికార్డ్, తన పేరుతో లికించుకున్నాడు. బావుమా కెప్టెన్సీలో ఇది అతని పదవ టెస్ట్ మాత్రమే. బావుమా గత వంద సంవత్సరాలలో కెప్టెన్‌గా తన కెరీర్‌లోని మొదటి పది టెస్ట్‌లలో 9 గెలిచిన మొదటి కెప్టెన్ అయ్యాడు.
బావుమా పెర్సీ చాప్మన్ కంటే మెరుగ్గా..
బావుమా కాకుండా, తన కెప్టెన్సీలో మొదటి 10 టెస్ట్ మ్యాచ్‌లలో 9 గెలిచిన మరో కెప్టెన్ ఇంగ్లాండ్‌కు చెందిన పెర్సీ చాప్‌మన్. అతను 1926-31 మధ్య ఈ ఘనతను సాధించాడు. కానీ, బావుమా, చాప్‌మన్ మధ్య ఉన్న పెద్ద తేడా ఏమిటంటే బావుమా మొదటి పది మ్యాచ్‌లలో ఒక్క ఓటమి కూడా ఎదుర్కోలేదు. ఒక మ్యాచ్ డ్రా అయినప్పటికీ, పెర్సీ చాప్‌మన్ కెప్టెన్‌గా మొదటి పది టెస్ట్ మ్యాచ్‌లలో ఒక ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన..
టెంబా బావుమా తన కెప్టెన్సీలో పది టెస్ట్ మ్యాచ్‌లలో బ్యాటింగ్‌తో కూడా అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లలో అతను 56.93 సగటుతో 911 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్ అయిన తర్వాత అతని ప్రదర్శన కూడా బాగా మెరుగుపడిందని ఇది చూపిస్తుంది.
శ్రీలంక జట్టుపై ఆధిపత్యం..
పది టెస్ట్ మ్యాచ్‌లలో బవుమా అత్యుత్తమ ప్రదర్శన శ్రీలంకపైనే. శ్రీలంకపై ఆడిన 2 మ్యాచ్‌ల్లో అతను 81.75 సగటుతో అత్యధికంగా 327 పరుగులు చేశాడు. అయితే బవుమా తన సొంత దేశంలో 10 టెస్ట్ మ్యాచ్‌ల్లో 7 ఆడాడు. ఈ ఏడు మ్యాచ్‌ల్లో, దక్షిణాఫ్రికా కెప్టెన్ 64.00 సగటుతో 74 పరుగులు చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




