- Telugu News Photo Gallery Sports photos Aiden Markram breaks sachin tendulkar record by 136 runs on australia in wtc 2025 final
27 ఏళ్ల తర్వాత.. క్రికెట్ దేవుడు సచిన్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన మార్కరమ్!
2025 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఐడెన్ మార్క్రమ్ అద్భుతమైన 136 పరుగుల ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ సెంచరీతో మార్క్రమ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. 27 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికాకు ఐసీసీ ట్రోఫీ, ఈ రికార్డు బ్రేక్ కావడం విశేషం.
Updated on: Jun 14, 2025 | 11:29 PM

2025 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈవెంట్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 136 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన మార్క్రమ్, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్‌తో మార్క్రమ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. యాదృచ్ఛికంగా 27 సంవత్సరాల తర్వాత ఈ రికార్డు బద్దలైంది. 27 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికాకు ఐసీసీ ట్రోఫీ రావడం, 27 ఏళ్ల తర్వాత ఈ రికార్డు బ్రేక్ కావడం విశేషం.

ఏ ఫార్మాట్‌లోనైనా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో మార్క్రామ్ చేసిన 136 పరుగుల ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంతకు ముందు ఈ రికార్డు 1998లో షార్జా కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 134 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సెంచరీ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇప్పుడు మార్క్రమ్ తన సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాపై కొత్త రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే, ఈ ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది, దీనికి ప్రతిస్పందనగా దక్షిణాఫ్రికా 138 పరుగులకు ఆలౌట్ అయింది. రెండవ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

WTC ఫైనల్‌లో సెంచరీ చేయడం ద్వారా, మార్క్‌రామ్ ICC టోర్నమెంట్ ఫైనల్‌లో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మార్క్‌రామ్ టెస్ట్ గణాంకాల ప్రకారం అతను 46 మ్యాచ్‌ల్లో 36.50 సగటు, 59.66 స్ట్రైక్ రేట్‌తో 2993 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.




