Virat Kohli IPL Records: సెంచరీ మిస్సయినా.. ప్రపంచ రికార్డ్ సృష్టించిన కోహ్లీ.. ప్రపంచంలోనే తొలిసారి ఇలా..

Virat Kohli IPL Records: కోహ్లి 195.74 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేశాడు. ఇందులో అతను ఏడు ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. కోహ్లీ తన తుఫాన్ ఇన్నింగ్స్‌లో చరిత్రలో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. ఈ లీగ్ చరిత్రలో పంజాబ్‌పై 1000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్‌లో కోహ్లి 1000 పరుగులు పూర్తి చేసిన మూడో జట్టుగా పంజాబ్ నిలిచింది.

Virat Kohli IPL Records: సెంచరీ మిస్సయినా.. ప్రపంచ రికార్డ్ సృష్టించిన కోహ్లీ.. ప్రపంచంలోనే తొలిసారి ఇలా..
Virat Kohli

Updated on: May 10, 2024 | 10:56 AM

Virat Kohli IPL Records: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ చేయలేని ఫీట్ చేశాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో, కోహ్లీ తన కెరీర్‌లో అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా ఆడాడు. 47 బంతుల్లో 92 పరుగులు చేసి స్ట్రైక్‌రేట్‌పై వేళ్లు చూపిన వారి నోరు మూయించాడు.

కోహ్లి 195.74 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేశాడు. ఇందులో అతను ఏడు ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. కోహ్లీ తన తుఫాన్ ఇన్నింగ్స్‌లో చరిత్రలో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. ఈ లీగ్ చరిత్రలో పంజాబ్‌పై 1000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్‌లో కోహ్లి 1000 పరుగులు పూర్తి చేసిన మూడో జట్టుగా పంజాబ్ నిలిచింది. ఐపీఎల్‌లో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

వార్నర్, రోహిత్‌లను అధిగమించిన విరాట్ కోహ్లీ..

ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా కోహ్లీ ఈ మార్కును అధిగమించాడు. వీరితో పాటు డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ మాత్రమే రెండు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు. వార్నర్ పంజాబ్, కోల్‌కతాపై 1000 పరుగులు సాధించగా, రోహిత్ ఢిల్లీ, కోల్‌కతాపై అలాంటి ఫీట్ చేశాడు.

నాలుగోసారి 600 పరుగులు దాటిన కోహ్లి..

ఈ సమయంలో, కోహ్లి ఈ ఐపీఎల్ సీజన్‌లో 600 పరుగులు కూడా దాటాడు. ఐపీఎల్‌లో నాలుగుసార్లు 600కు పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 2013, 2016, 2023లో కూడా 600కు పైగా పరుగులు చేశాడు. IPL 2024లో, అతను 12 మ్యాచ్‌లలో 70.44 సగటు, 153.51 స్ట్రైక్ రేట్‌తో 634 పరుగులు చేశాడు. అతను ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..