AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరమాస్ బ్యాటింగ్.. క్రికెట్‌ లీగ్‌ చరిత్రలోనే అతి పెద్ద సిక్స్‌..స్టేడియం బయటకు బంతి.. వీడియో వైరల్‌

టీ 20 క్రికెట్ మ్యాచ్‌లంటేనే ఫోర్లు, సిక్సర్లు. బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బంతులేసినా ఇక్కడ బ్యాటర్లదే ఆధిపత్యం. పేరు మోసిన బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ క్షణాల్లో మ్యాచ్‌ ఫలితాలను మార్చేస్తుంటారు. ప్రస్తుతం పాకిస్తాన్‌ వేదికగా జరుగుతున్న పీఎస్‌ఎల్‌లోనూ ఇదే జరుగుతోంది.

ఊరమాస్ బ్యాటింగ్.. క్రికెట్‌ లీగ్‌ చరిత్రలోనే అతి పెద్ద సిక్స్‌..స్టేడియం బయటకు బంతి.. వీడియో వైరల్‌
Rovman Powell
Basha Shek
|

Updated on: Mar 09, 2023 | 4:17 PM

Share

టీ 20 క్రికెట్ మ్యాచ్‌లంటేనే ఫోర్లు, సిక్సర్లు. బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బంతులేసినా ఇక్కడ బ్యాటర్లదే ఆధిపత్యం. పేరు మోసిన బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ క్షణాల్లో మ్యాచ్‌ ఫలితాలను మార్చేస్తుంటారు. ప్రస్తుతం పాకిస్తాన్‌ వేదికగా జరుగుతున్న పీఎస్‌ఎల్‌లోనూ ఇదే జరుగుతోంది. అప్పుడప్పుడు బౌలర్ల ఆధిపత్యం కనిపిస్తున్నప్పటికీ ఎక్కువగా భారీ స్కోర్లే నమోదవుతున్నాయి. తాజాగా ఈ క్రికెట్‌ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తోన్న వెస్టిండీస్‌ టీ20 కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 18 బంతులు ఎదుర్కొన్న పావెల్‌ 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో పావెల్‌ కొట్టిన ఒక బంతి హైలెట్‌గా నిలిచింది. 15 ఓవర్‌ వేసిన మహ్మద్‌ నవాజ్‌ బౌలింగ్‌లో తొలి బంతిని 116 మీటర్ల ఓ భారీ సిక్సర్‌ బాదాడు. పావెల్‌ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయటకు వెళ్లి పడింది. దీంతో నవాజ్‌కు కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. కాగా పావెల్‌ కొట్టిన సిక్స్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ చరిత్రలోనే బిగ్గెస్ట్‌ సిక్స్‌ల్లో ఒకటిగా నిలిచింది.

ప్రస్తుతం సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పెషావర్ పరాజయం పాలైంది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. క్వెట్టా ఓపెనర్‌ ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ 63 బంతుల్లో 145పరుగులు నాటౌట్‌ సునామీ శతకంతో తమ జట్టును గెలిపించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్‌ బాబర్‌ ఆజం కూడా సూపర్‌ సెంచరీతో చెలరేగాడు. 65 బంతులు ఎదుర్కొన్న బాబర్‌ 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115 పరుగులు సాధించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..