Virat Kohli Century : సెంచరీ బాదిన కోహ్లీని హత్తుకున్న హెడ్ కోచ్ గంభీర్.. మరి రోహిత్ ఏంటి అంత మాటన్నాడు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తన 52వ సెంచరీని నమోదు చేశాడు. దాదాపు 9 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన కోహ్లీ బ్యాటింగ్, అభిమానులకు పెద్ద పండగలా అనిపించింది.

Virat Kohli Century : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తన 52వ సెంచరీని నమోదు చేశాడు. దాదాపు 9 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన కోహ్లీ బ్యాటింగ్, అభిమానులకు పెద్ద పండగలా అనిపించింది. కోహ్లీ కేవలం 120 బంతుల్లో 135 పరుగులు (7 సిక్స్‌లు, 11 ఫోర్లు) చేసి అద్భుతమైన రికార్డులు సృష్టించాడు. అయితే, కోహ్లీ సెంచరీ సాధించిన వెంటనే పవెలియన్‌లో ఉన్న టీమిండియా సభ్యులు, ముఖ్యంగా రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ల ప్రతిస్పందనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ బౌండరీతో సెంచరీ పూర్తి చేయగానే, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. రోహిత్ శర్మ సాధారణంగా ఉద్వేగంతో ఉన్నప్పుడు నోటిని అదుపు చేసుకోలేక పోవడం అలవాటు. ఈసారి కూడా కోహ్లీ సెంచరీ పూర్తవగానే, రోహిత్ శర్మ ఉద్వేగంతో ఏదో మాట్లాడడం వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రోహిత్ ఆ పదాన్ని కోహ్లీని అభినందించే ఉద్దేశంతోనే వాడినా అది భాషాపరమైన హద్దులు దాటింది.
కోహ్లీ ఔటై ఫెవీలియన్ కు తిరిగి వచ్చినప్పుడు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా నిలబడి చప్పట్లు కొట్టాడు. అంతేకాక, డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ స్వయంగా వెళ్లి కోహ్లీని గట్టిగా ఆలింగనం చేసుకొని అభినందించడం జరిగింది. తన రికార్డు-బ్రేకింగ్ సెంచరీని విరాట్ కోహ్లీ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. కోహ్లీ సెంచరీ పూర్తి కాగానే గాల్లోకి ఎగిరి, ఆవేశంగా తన బ్యాట్‌ను గాల్లోకి ఊపాడు. చాలా కాలం తర్వాత కోహ్లీలో ఈ విధమైన దూకుడు కనిపించింది.
Rohit Sharma reaction on Virat Kohli century. 😭pic.twitter.com/hmsllR1eYm
— Selfless⁴⁵ (@SelflessCricket) November 30, 2025
A leap of joy ❤️💯
A thoroughly entertaining innings from Virat Kohli 🍿
Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5
— BCCI (@BCCI) November 30, 2025
బ్యాట్ పైకెత్తిన తర్వాత, కోహ్లీ తన మెడలో వేలాడుతున్న ఉంగరాన్ని ముద్దు పెట్టుకోవడం ద్వారా తన సెంచరీని తన కుటుంబానికి అంకితం చేశాడు. ఆ తర్వాత రెండు చేతులు జోడించి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాడు. విరాట్ కోహ్లీ సాధించిన ఈ 52వ సెంచరీ చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది.
ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ ఒకే ఫార్మాట్‌లో అత్యధికంగా 52 సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ సాధించిన 51 సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో నమోదైన 7000వ సెంచరీ కావడం విశేషం. సౌతాఫ్రికా పై వన్డేల్లో 6 సెంచరీలు నమోదు చేసి, ఆ దేశంపై అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




