ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప కెప్టెన్?
టీమిండియా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంతో ధోని, కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలను పోల్చే చర్చ మొదలైంది. ధోని 6 ఐసీసీ టోర్నీల్లో 3 గెలిచాడు, కోహ్లీ 3లో 0, రోహిత్ 5లో 2 గెలిచాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప కెప్టెన్ అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. దాని గురించి ఇప్పుడు చూద్దాం..

టీమిండియా ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమిండియా, 2013లో ఛాంపియన్‌గా నిలిచింది. మల్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలి ట్రోఫీని సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో, రెండో కప్పును ఎంఎస్ ధోని కెప్టెన్సీలో, ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు కప్పు సాధించింది. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత సోషల్ మీడియా వేదికగా మరోసారి ఫ్యాన్ వార్ మొదలైంది. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు? అంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్‌లో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీని ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానుల మధ్య ఈ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరి కెప్టెన్సీలో టీమిండియా ఎన్ని కప్పులు సాధించింది. ఎన్ని ఐసీసీ టోర్నీలు ఆడిందో ఒకసారి లెక్కలు చూద్దాం..
ముందుగా మహేంద్ర సింగ్ ధోని విషయానికి వస్తే.. ధోని కెప్టెన్సీలో టీమిండియా మొత్తం 6 ఐసీసీ టోర్నీల్లో పాల్గొంది. వాటిలో మూడు టోర్నీల్లో విజయాలు సాధించింది. ఒకటి టీ20 వరల్డ్ కప్ 2007. రెండోది వన్డే వరల్డ్ కప్ 2011, అలాగే మూడోది ఛాంపియన్స్ ట్రోఫీ 2013. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా మూడు ఐసీసీ టోర్నీలు ఆడింది. అవి వన్డే వరల్డ్ కప్ 2019, టీ20 వరల్డ్ కప్ 2021, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021లో టీమిండియా కోహ్లీ కెప్టెన్సీలో ఆడింది. వీటిలో ఏది కూడా టీమిండియా గెవలేదు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఐదు ఐసీసీ ట్రోఫీల్లో పాల్గొంది. టీ20 వరల్డ్ కప్ 2022, వన్డే వరల్డ్ కప్ 2023, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023, టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వీటిలో టీ20 వరల్డ్ కప్ 2024, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సాధించింది. మరి వీరి ముగ్గురిలో ఎవరు గొప్ప కెప్టెన్ అనే విషయాన్ని కేవలం ట్రోఫీల సంఖ్యతో చెప్పడం సరైంది కాదు అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ధోని నాయకత్వం వహించిన జట్టు వేరు, అలాగే కోహ్లీ అండర్‌లో ఆడిన టీమ్ వేరు, ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతున్న యంగ్ టీమ్ వేరు. అయినా ఒక్క కెప్టెన్ వల్ల కప్పులు రావు, అలాగే జట్టు మొత్తం అద్భుతంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకునే కెప్టెన్ లేకపోయినా కప్పులు రావు. ధోని కెప్టెన్సీలో ఎక్కవ వేర్వేరు ఐసీసీ ట్రోర్నీల కప్పులు టీమిండియా గెలవచ్చు, కోహ్లీ కెప్టెన్సీలో కప్పులు రాకపోయినా టీమిండియా ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా మారి, టెస్టుల్లో నంబర్ వన్‌గా ఉండొచ్చు, రోహిత్ కెప్టెన్సీలో వరుసగా రెండు కప్పులు టీమిండియా కొట్టొచ్చు. అలా అని ఒకరు ఎక్కువగా కాదు, ఒకరు తక్కువ కాదు. అందరు మంచి కెప్టెన్లు వారి వారి హయాంలో టీమిండియాను నెక్ట్స్ స్టెప్‌కి తీసుకెళ్లారు. సో ఈ ఫ్యాన్ వార్స్ పక్కనపెట్టి అందరి సక్సెస్‌ను ఎంజాయ్ చేయాలంటూ క్రికెట్ ఎక్స్‌ప్టర్స్ అంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..