Rohit Sharma: స్పిన్నర్‌గా హిట్‌మ్యాన్ ఖాతాలో ఓ రికార్డు ఉంది…! మీకు తెలుసా..!
On this day in 2009: ఇలా తన స్పిన్ మంత్రంతో చాలా రికార్డులు కూడా ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో పలుసార్లు బౌలింగ్ చేసి అలరించినా ప్రస్తుతం బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి సారించి బౌలింగ్‌కు దూరంగా...
రోహిత్ శర్మ.. టీమ్ఇండియా స్టార్ ఓపెనర్… వన్డేల్లో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా మూడు డబుల్ సెంచరీలు సాధించి హిట్‌మ్యాన్‌గా కూడా సొంత రికార్డులను క్రియేట్ చేసుకున్నాడు. అయితే రోహిత్ మంచి స్పిన్నర్ కూడా.. ఈ సంగతి చాలా మందికి తెలియదు. ఇలా తన స్పిన్ మంత్రంతో చాలా రికార్డులు కూడా ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో పలుసార్లు బౌలింగ్ చేసి అలరించినా ప్రస్తుతం బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి సారించి బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్ రికార్డు కూడా ఉంది. ఈ ఘనత సాధించింది సరిగ్గా ఏప్రిల్ 06నే…. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్ బౌలింగ్‌లో ఈ హ్యాట్రిక్ రికార్డును నమోదు చేసుకున్నాడు.
ఆ రోజు ఏం జరిగిదంటే…
ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్కన్ ఛార్జర్స్… నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ 38 పరుగులతో అలరించాడు. ఆ తర్వాత టార్గెట్ ఛేదనలో ముంబై ఇండియన్స్ 16 ఓవర్లు ముగిసే సమయానికి 103/4తో నిలిచింది. మరో నాలుగు ఓవర్లు మాత్రమే ఇన్నాయి.
ఇక్కడే తిప్పేశాడు…
అయితే.. 16వ ఓవర్ వేసిన రోహిత్ శర్మ చివరి రెండు బంతుల్లోనూ అభిషేక్ నాయర్ (1), హర్భజన్ సింగ్(0)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత 18వ ఓవర్ తొలి బంతికే జేపీ డుమినీ (52)ని పెవిలియన్ దారి పట్టించాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో దక్కన్ ఛార్జర్స్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో 6 పరుగులకే నాలుగు వికెట్లు దక్కించుకుని తన కెరీర్లో ఓ రికార్డును నమోదు చేసుకున్నాడు. విజయవంతమైన కెప్టెన్ 2008లో ప్రారంభమైన ఈ ఐపీఎల్‌లో దక్కన్ ఛార్జర్స్‌కు తొలిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో ఆ జట్టు తరఫున అత్యధికంగా 404 పరుగులు చేశాడు. తర్వాతి ఏడాది వైస్ కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు. అదే సంవత్సరం జోహెన్స్‌బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్లో గెలిచి కప్పు సాధించిందీ జట్టు. ఏడాది తర్వాత ముంబై ఇండియన్స్ రోహిత్ ను దక్కించుకుంది. 2013 సీజన్ మధ్యలో రికీ పాంటింగ్‌ను తప్పించి రోహిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్ గా తొలి సీజన్లో జట్టును విజేతగా నిలిపాడు. తర్వాత 2015, 2017, 2019, 2020లో ముంబై ఇండియన్స్ కి ట్రోఫీలు అందించి… క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్నాడు.