AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: మాల్దీవులుకు ఆస్ట్రేలియన్​ ప్లేయర్స్.. భారత్​లోనే కివీస్ క్రికెటర్లు

దేశంలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఐపీఎల్​ వాయిదా పడింది.  దీంతో విదేశీ ఆటగాళ్లను తమ స్వదేశాలకు పంపించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. ఇందులో భాగంగా...

IPL 2021: మాల్దీవులుకు ఆస్ట్రేలియన్​ ప్లేయర్స్.. భారత్​లోనే కివీస్ క్రికెటర్లు
Australians Flew Off
Sanjay Kasula
|

Updated on: May 07, 2021 | 12:00 AM

Share

దేశంలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఐపీఎల్​ వాయిదా పడింది.  దీంతో విదేశీ ఆటగాళ్లను తమ స్వదేశాలకు పంపించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. ఇందులో భాగంగా న్యూజిలాండ్​కు చెందిన ప్లేయర్లు కొందరు నేరుగా స్వదేశానికి వెళ్లనుండగా.. మరికొందరు ఇక్కడే ఉండనున్నారు. ఆంక్షల కారణంగా ఆస్ట్రేలియన్​ ప్లేయర్స్​ మాల్దీవులు చేరుకున్నారు. బంగ్లాదేశ్​, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వారి ఇళ్లకు బయలుదేరిపోయారు.

వారిని స్వదేశాలకు చేర్చేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఇలా తమ స్వంత స్థలాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా​ ఆటగాళ్లు, కోచ్​లు మిగతా సిబ్బంది​ తమ దేశ ప్రభుత్వం విధించిన ప్రయాణ ఆంక్షల కారణంగా ముందుగా ఇక్కడి నుంచి మాల్దీవులకు చేరుకున్నారు.

తమ ప్రభుత్వం నిబంధనలను సరళీకరించేవరకు అక్కడే ఉండి ఆ తర్వాత సొంతగూటికి చేరుకుంటారు. అయితే చెన్నై సూపర్​ కింగ్స్​ బ్యాటింగ్​ కోచ్​ మైక్​ హస్సీ మాత్రం కోవిడ్ సోకడం వల్ల ఇక్కడే ఉండిపోయాడు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాతే చార్టెడ్​ ఫ్లైట్​ ద్వారా వెళ్తాడు. ఈ విషయాన్ని ఆసీస్​ క్రికెట్​ బోర్డు తెలిపింది.

దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ప్లేయర్స్​ బయలుదేరారు ఈ లీగ్​లో పాల్గొన్న 11మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సాధారణ విమానాల తమ స్వంత దేశానికి బయలుదేరిపోయారు. బంగ్లాదేశ్​ ఆటగాళ్లు షకీబ్​ అల్​ హాసన్ ​, ముస్తాఫిజుర్​ రెహ్మాన్ తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంతో స్వస్థలానికి ఇప్పటికే చేరుకున్నారు.

తాము క్షేమంగానే ఉన్నట్లు చేరుకున్న తర్వాత సోషల్ మీడియా ద్వార వెల్లడించారు. ఇంగ్లాండ్​ క్రికెటర్లు కూడాఇంగ్లాండ్‌ క్రికెటర్లు లండన్‌ చేరుకున్నారు. టోర్నీలో మొత్తం 12 మంది ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఉండగా.. గాయంతో టోర్నీకి దూరమైన బెన్‌ స్టోక్స్‌ అందరి కంటే ముందు స్వదేశానికి వెళ్లిపోయాడు.

టోర్నీ వాయిదా పడ్డాక ఎనిమిది మంది భారత్‌ నుంచి బయల్దేరి లండన్‌ చేరుకున్నారు. వీరిలో బట్లర్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, టామ్‌ కరన్‌, క్రిస్‌ వోక్స్‌, జానీ బెయిర్‌స్టో, జేసన్‌ రాయ్‌, సామ్‌ బిల్లింగ్స్‌ ఈ బృందంలో ఉన్నారు. ఇయాన్‌ మోర్గాన్‌, క్రిస్‌ జోర్డాన్‌, డేవిడ్‌ మలన్‌ ఒకట్రెండు రోజుల్లో స్వదేశానికి బయల్దేరతారు. మొత్తం 18 మంది న్యూజిలాండ్​కు చెందిన వారు ఐపీఎల్​లో పాల్గొనగా టెస్టు జట్టు సభ్యులు మినహాయిస్తే మిగతా వారు స్వదేశానికి పయనమవుతారు.

ఇవి కూడా చదవండి: Aadhar Card: ఆధార్ మిస్ యూజ్ అవుతుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారా? మీ కార్డును ఇలా లాక్ చేసుకోండి..

ఏపీ విద్యార్థుల‌కు జ‌గన్ స‌ర్కార్ గుడ్ న్యూస్.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్