IND vs WI 1st ODI: విండీస్‌పై అద్భుత విజయం.. కట్‌చేస్తే.. టీమిండియా ఖాతాలో రికార్డుల వర్షం..
Team India Records: వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్‌పై టీమ్ ఇండియాకు వరుసగా తొమ్మిదో విజయం. ఈ విజయంతో రోహిత్ శర్మ జట్టు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
గురువారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది వరుసగా తొమ్మిదో వన్డే విజయం. ఈ విజయంతో రోహిత్ శర్మ జట్టు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
ODI క్రికెట్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు కోల్పోయినా.. ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే విజయం దక్కించుకున్న జట్లే ఏవో ఇప్పుడు చూద్దాం..
180 బంతులు SL vs Aus బ్రిస్బేన్ 2013,
163 Ind vs WI బ్రిడ్జ్‌టౌన్ 2023
162 NZ vs CAN బెనోని 2003
161 NZ vs AUS ఆక్లాండ్ 2015
వెస్టిండీస్ vs భారత్ మ్యాచ్‌ల్లో కరేబీయన్ జట్టు అతి తక్కువ వన్డే స్కోర్లు ఇవే..
104, తిరువనంతపురం 2018,
114, బ్రిడ్జ్‌టౌన్ 2023,
121, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ 1997,
123, కోల్‌కతా 1993
వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసిన సమయంలో నమోదైన స్కోర్లు, ఓవర్లు..
22.0 vs బంగ్లాదేశ్, ఛటోగ్రామ్ 2011 (61 పరుగులు)
23.0 vs భారతదేశం, బ్రిడ్జ్‌టౌన్ 2023 (114 పరుగులు),
23.5 vs ఆస్ట్రేలియా, పెర్త్ 2013 (70 పరుగులు)
భారత్ వేసిన అతి తక్కువ ఓవర్లు..
17.4 vs బంగ్లాదేశ్, మీర్పూర్ 2014 (58 పరుగులు),
22 vs శ్రీలంక, తిరువనంతపురం 2023 (73 పరుగులు),
23 vs శ్రీలంక, జోహన్నెస్‌బర్గ్ 2003 (109 పరుగులు),
23 vs వెస్టిండీస్, బ్రిడ్జ్‌టౌన్ 2023 (114 పరుగులు)
కుల్దీప్, జడేజా రికార్డ్: కుల్దీప్ యాదవ్ (4/6), రవీంద్ర జడేజా (3/37) వన్డేల్లో ఏడు (లేదా అంతకంటే ఎక్కువ) వికెట్లు తీసిన తొలి ఎడమచేతి వాటం స్పిన్నర్లుగా నిలిచారు.
స్వదేశంలో వెస్టిండీస్ టీం నమోదు చేసిన అత్యల్ప స్కోర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
98 vs పాకిస్తాన్, ప్రొవిడెన్స్ 2013,
108 vs బంగ్లాదేశ్, ప్రొవిడెన్స్ 2022,
114 vs పాకిస్తాన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ 2000,
114 vs భారతదేశం, బ్రిడ్జ్‌టౌన్ 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..