AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్ మాట్లాడే ప్రతీ లైన్‌లో బూతులే.. మైదానంలో మమ్మల్ని తిడుతూనే ఉంటాడు: టీమిండియా ప్లేయర్ సెన్సేషనల్ కామెంట్స్

Rohit Sharma Abuses Words: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, రోహిత్ శర్మ ముంబై తరపున ఆడుతూ హార్దిక్ పాండ్యాతో వివాదాలకు స్వస్తి పలికాడు. రోహిత్ చాలా సార్లు హార్దిక్‌కి మార్గనిర్దేశం చేయడం, వివరించడం కనిపించింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టు చాలా దారుణంగా ఆడుతోంది.

రోహిత్ మాట్లాడే ప్రతీ లైన్‌లో బూతులే.. మైదానంలో మమ్మల్ని తిడుతూనే ఉంటాడు: టీమిండియా ప్లేయర్ సెన్సేషనల్ కామెంట్స్
Rohit Sharma Shreyas Iyer
Venkata Chari
|

Updated on: Apr 07, 2024 | 12:08 PM

Share

Rohit Sharma Abuses Words: కపిల్ శర్మ షో తాజాగా మొదలైంది. ఇందులో టీమిండియా నుంచి ఇద్దరు ప్రత్యేక అతిథులను పిలిచారు. ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ షోలో సరదాగా గడిపారు. చాలా విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో రోహిత్ ఇతర ఆటగాళ్ల సీక్రెట్స్‌ను బహిర్గతం చేశాడు. ఇందులో శ్రేయాస్ అయ్యర్ రోహిత్‌ని ఎగతాళి చేయడం చూడొచ్చు. అయితే, వీటన్నింటి మధ్య శ్రేయాస్ అయ్యర్ చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఓ విషయం చెప్పుకొచ్చాడు.

రోహిత్ ఎక్కువగా దుర్భాషలాడతాడు..

టీమిండియాలో రోహిత్ శర్మ ఎక్కువగా దుర్భాషలాడాతాడని శ్రేయాస్ అయ్యర్ అన్నాడు. కొన్నిసార్లు ఒకే వాక్యంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉపయోగిస్తాడని తెలిపాడు. అది విని ప్రేక్షకులంతా నవ్వడం మొదలుపెట్టారు.

మా అబ్బాయిలు సోమరిపోతులు..

ఈ సమయంలో, రెండు స్టంప్‌లకు మైకులు అమర్చబడి ఉంటాయి, అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా కోపంతో ఎవరికైనా క్లాస్ తీసుకున్నారా? అంటూ కపిల్ రోహిత్ శర్మను ప్రశ్నించాడు. దీనికి రోహిత్ శర్మ సమాధనమిస్తూ “నేను ఏమి చేయగలను.. మా అబ్బాయిలు సోమరిపోతులు” అంటూ బదులిచ్చాడు. రోహిత్ ఇలా చెప్పడంతో అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఈ సమయంలో ఆసమయంలో రోహిత్ భార్య కూడా కనిపించింది. ఆమె కూడా నవ్వు ఆపుకోలేకపోయింది.

రోహిత్ శర్మ తన ఆటగాళ్లపై అరవడంపై ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ సందర్భాన్ని గుర్తుచూస్తూ “మ్యాచ్‌ల సమయంలో నా సహచరులను ఉద్దేశించి నేను కొన్ని కఠినమైన పదాలు చెబుతూ పట్టుబడ్డాను. స్టంప్ మైక్‌లో నా మాటలు వినబడ్డాయి. కానీ నేను ఎవరినీ బాధపెట్టడానికి అలాంటి భాష ఉపయోగించను. ఇది నా స్వభావం. నేను జట్టును ఎలా నడిపిస్తాను. మైదానంలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలంటూ వారిని హెచ్చరిస్తుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, రోహిత్ శర్మ ముంబై తరపున ఆడుతూ హార్దిక్ పాండ్యాతో వివాదాలకు స్వస్తి పలికాడు. రోహిత్ చాలా సార్లు హార్దిక్‌కి మార్గనిర్దేశం చేయడం, వివరించడం కనిపించింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టు చాలా దారుణంగా ఆడుతోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..