IND vs ENG: 5వ టెస్ట్‌కు ముందు భారత జట్టులో చేరిన సిక్సర్ల సింగ్.. ధర్మశాలలో ఏం చేశాడో తెలుసా?
India vs England 5th Test: మార్చి 7 నుంచి ధర్మశాలలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు జరగనుంది. దీనికి మూడు రోజుల ముందు రింకూ సింగ్ టీమిండియా ఆటగాళ్లతో కలిసి కనిపించాడు. రింకూ సింగ్ భారత్ తరపున ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 89 సగటు, 176.23 స్ట్రైక్ రేట్‌తో 356 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి రెండు అర్ధ సెంచరీలు వచ్చాయి. అందులో 69 నాటౌట్ అత్యధిక స్కోరుగా నిలిచింది. ఈ ఫార్మాట్‌లో భారత్ తరపున 31 ఫోర్లు, 20 సిక్సర్లు కొట్టాడు.

Rinku Singh: భారత్-ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టుకు ముందు సిక్సర్ల రింకూ సింగ్ (Rinku Singh) ధర్మశాల చేరుకున్నాడు. మార్చి 4న అతను టీమిండియా ఆటగాళ్లతో కనిపించాడు. టెస్టు సిరీస్‌లో రింకూ టీమ్ ఇండియాలో భాగం కాదు. అతను దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ జట్టుతో చేరాడు. కానీ, ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపిక కాలేదు. భారత్-ఇంగ్లండ్ సిరీస్‌లో అతను ఉత్తరప్రదేశ్ తరపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, ధర్మశాల టెస్టుకు ముందే రింకూ సింగ్ టీమిండియాలో ఎందుకు చేరాడు? అని అంతా మాట్లాడుకుంటున్నారు.
రింకూ సింగ్ నిజానికి T20 వరల్డ్ కప్ 2024 కోసం ఒక పనికి సంబంధించి ధర్మశాల చేరుకున్నాడు. మార్చి 3న చివరి టెస్టు కోసం భారత జట్టు ధర్మశాలకు వచ్చింది. ఈ క్రమంలో మార్చి 4న వారికి సెలవు ఉంది. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌లో ప్రాబబుల్ ఆటగాళ్ల ఫొటో షూట్ జరిగింది. ఇలాంటి పరిస్థితిలో రింకూని కూడా బీసీసీఐ పిలిచింది. T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఇంకా ప్రకటించలేదు. కానీ, ఈ టోర్నమెంట్‌లో ఆడటానికి రింకూ అతిపెద్ద పోటీదారుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌లో, ఆ తర్వాత టీమ్ ఇండియాలో ఫినిషర్ పాత్రలో తానేంటో నిరూపించుకున్నాడు. ఈ కారణంగా, అతను ఇతర భారతీయ ఆటగాళ్లతో స్టేడియంలో ఫొటో షూట్ చేశాడు.
2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత సారథిగా రోహిత్ శర్మ..
జూన్ 2024లో వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా T20 ప్రపంచ కప్‌ను నిర్వహించనున్నాయి. ఇందులో భారత్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని స్పష్టమైంది. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీకి భారత జట్టును మే ప్రారంభంలో ప్రకటించనున్న సంగతి తెలిసిందే. భారత ఆటగాళ్లు రెండు భాగాలుగా టీ20 ప్రపంచకప్‌కు వెళ్లవచ్చు. ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో ఏ జట్లు ఔట్ అవుతాయో ఆ ఆటగాళ్లు ముందుగా వెళ్తారు. ప్లేఆఫ్స్‌కు వెళ్లే జట్ల నుంచి ఎంపికైన ఆటగాళ్లు చివరిగా వెళ్తారు. టోర్నీలో భారత్ తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో జూన్ 5న జరగనుంది.
టీమిండియా తరపున రింకూ సింగ్ రికార్డు..
View this post on Instagram
రింకూ సింగ్ భారత్ తరపున ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 89 సగటు, 176.23 స్ట్రైక్ రేట్‌తో 356 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి రెండు అర్ధ సెంచరీలు వచ్చాయి. అందులో 69 నాటౌట్ అత్యధిక స్కోరుగా నిలిచింది. ఈ ఫార్మాట్‌లో భారత్ తరపున 31 ఫోర్లు, 20 సిక్సర్లు కొట్టాడు. 26 ఏళ్ల రింకూ టీమ్ ఇండియా తరపున రెండు వన్డేలు కూడా ఆడాడు. అందులో అతను 55 పరుగులు చేశాడు.
రింకూ రాకతో భారత జట్టు బలం..
ప్లేయింగ్-11లో రింకూ సింగ్ చేరితే భారత జట్టుకు మరింత బలం చేకూరుతుంది. రింకూ పరిమిత ఓవర్ల గేమ్‌లలో అత్యుత్తమ ఫినిషర్‌గా నిరూపించుకున్నాడు. రింకూ చివరి మ్యాచ్ ఆడితే, అతను తన బ్యాట్‌తో ఇంగ్లండ్ బేస్ బాల్ గేమ్‌కు తగిన సమాధానం ఇవ్వగలడు. రజత్ పాటిదార్ స్థానంలో రింకూను జట్టులోకి తీసుకోవచ్చనే సమాచారం కూడా అందుతోంది.
ధర్మశాలలో 5వ టెస్టుకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
1వ టెస్టు: జనవరి 25-29, హైదరాబాద్ (ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం)
2వ టెస్టు: 2-6 ఫిబ్రవరి, విశాఖపట్నం (106 పరుగుల తేడాతో భారత్ విజయం)
3వ టెస్టు: ఫిబ్రవరి 15-19, రాజ్‌కోట్ (434 పరుగులతో భారత్ విజయం)
4వ టెస్టు : 23-27 ఫిబ్రవరి, రాంచీ (భారత్ 5 వికెట్ల తేడాతో విజయం)
5వ టెస్ట్: మార్చి 7-11, ధర్మశాల
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








