IND vs AUS: 4 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 9 బంతుల్లోనే 31 పరుగులు.. రింకూ సునామీ ఇన్నింగ్స్‌ చూశారా? వీడియో

రింకూ సునామీ ఇన్నింగ్స్‌తో టీ20 ఫార్మాట్‌లో టీమ్ ఇండియా ఐదో అత్యధిక స్కోరును నమోదు చేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 235 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతు రాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌ అర్థసెంచరీలతో రాణించారు. ఇక ఇన్నింగ్స్‌ చివర్లో రింకూ ఆడిన సునామీ ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది.

IND vs AUS: 4 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 9 బంతుల్లోనే 31 పరుగులు.. రింకూ సునామీ ఇన్నింగ్స్‌ చూశారా? వీడియో
Rinku Singh
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2023 | 8:43 AM

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ రింకూ సింగ్ తనకు ఇచ్చిన ఫినిషింగ్ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాడు. కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 31 పరుగులు చేశాడు. రింకూ సునామీ ఇన్నింగ్స్‌తో టీ20 ఫార్మాట్‌లో టీమ్ ఇండియా ఐదో అత్యధిక స్కోరును నమోదు చేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 235 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతు రాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌ అర్థసెంచరీలతో రాణించారు. ఇక ఇన్నింగ్స్‌ చివర్లో రింకూ ఆడిన సునామీ ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది. కాగా మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మాట్లాడుతూ.. ‘నేను కొంతకాలంగా 5-6 నంబర్‌లో ఆడుతున్నాను. అందుకే ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. బంతిని నిశితంగా గమనిస్తూ తదనుగుణంగా ఆడతాను. సూర్యకుమార్ నాయకత్వాన్ని ఆనందిస్తున్నాము. చివరి 5 ఓవర్లలో బ్యాటింగ్ చేయడం నా పని. కాబట్టి నేను ఫినిషింగ్ స్కిల్స్‌ గురించి నేర్చుకుంటు్నాను. నేను నా నెట్ సెషన్‌లను అదే ఆలోచనతో ప్రాక్టీస్ చేస్తాను’ అని చెప్పాడు.

కాగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ రింకూ సింగ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 14 బంతుల్లోనే14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. భారత్ తరఫున యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, రితురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

రింకూ సింగ్ సునామీ ఇన్నింగ్స్.. వీడియో

30 సెకన్లలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ హైలెట్స్..

భారత్:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ మరియు ముఖేష్ కుమార్.

ఆస్ట్రేలియా:

మాథ్యూ వేడ్ (కెప్టెన్/వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, షాన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..