RCB, IPL 2025: ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరినా ట్రోఫీ గెలిచే ఛాన్స్ జీరోనే.. కోహ్లీ 17 ఏళ్ల కల కలగానే?
Royal Challengers Bengaluru IPL 2025 Analysis: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), 2025 IPL ఫైనల్‌కు చేరుకుని, తమ తొలి టైటిల్ కోసం పోరాడుతోంది. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుతంగా రాణించింది. అయితే, గతంలో మూడు ఫైనల్స్‌లో ఓడిపోయిన వాస్తవం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయంపై సందేహాలను రేకెత్తిస్తోంది.

RCB IPL 2025 Can They Win The Title: ఐపీఎల్ 2025 (IPL 2025) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుతంగా రాణించింది. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఫైనల్‌కు టికెట్ లభించింది. ఐపీఎల్ చరిత్రలో తొలి టైటిల్ గెలవడానికి ఆర్‌బీసీ కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. దీంతో 17 ఏళ్ల కల జూన్ 3న నెరవేరవచ్చు. కానీ, పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈసారి ఆర్‌సీబీ టైటిల్ గెలవగలదా? కానీ, ఈ ప్రశ్నపై ప్రతి ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.
జూన్ 3న ఐపీఎల్ 2025 ఫైనల్ ఆడనున్న ఆర్‌సీబీ..
ఐపీఎల్ 2025 18వ సీజన్ చివరి ప్రయాణం వైపు వెళుతోంది. ఈ టోర్నమెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూపంలో తొలి జట్టు వచ్చింది. క్వాలిఫయర్-2 జూన్ 1న ముంబై వర్సెస్ పంజాబ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే అది బెంగళూరుతో తలపడుతుంది. రజత్ పాటిదార్ సేన 9 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరు జట్టు తన మొదటి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది.
ఆర్సీబీ ఐపీఎల్ 2025 టైటిల్ ఎందుకు గెలవలేదు?
క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే. క్రికెట్‌లో చివరి బంతి వేసే వరకు ఏమీ చెప్పలేమని చెబుతుంటారు. ఎందుకంటే. అన్ని అంచనాలు తలకిందులయ్యే ఛాన్స్ ఉంది క్రికెట్‌లో. కానీ, క్రీడా నిపుణులు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అంచనా వేస్తుంటారు. ఇది కూడా సాధ్యమే. ఆర్‌సీబీ ఫామ్, జట్టు ఆటగాళ్లను పరిశీలిస్తే ఈ సంవత్సరం తన తొలి టైటిల్‌ను గెలుచుకోగలదనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ, బెంగళూరు అలా చేయడంలో విఫలం కావొచ్చు.
ఎందుకంటే, ఈ జట్టుకు ఇంతకు ముందు కూడా 3 సార్లు అవకాశాలు వచ్చాయి. కానీ మూడుసార్లు ఫైనల్స్‌లో ఓడిపోయింది. టోర్నమెంట్ అంతటా బాగా రాణిస్తుంది కానీ, టైటిల్ మ్యాచ్‌లో ఆ ఉత్సాహాన్ని కోల్పోతుంది. ఈసారి కూడా ఇలాంటిదేదో చూస్తామా? లేదా వఆ స్టోరీని బ్రేక్ చేయడం చూస్తామా? దీనికి కాలమే సమాధానమిస్తుంది. ఫైనల్ మ్యాచ్ గణాంకాలు మాత్రం బెంగళూరుకు అనుకూలంగా లేవు.
ఐపీఎల్ ఫైనల్లో ఆర్‌సీబీ ఎప్పుడు ఏ జట్టు చేతిలో ఓడిపోయిందంటే?
సంవత్సరం | ప్రతిపక్ష జట్టు | ఫలితం |
---|---|---|
2009 | డెక్కన్ ఛార్జర్స్ | ఓటమి (6 పరుగుల తేడాతో) |
2011 | చెన్నై సూపర్ కింగ్స్ | ఓటమి (58 పరుగుల తేడాతో) |
2016 | సన్‌రైజర్స్ హైదరాబాద్ | ఓటమి (8 పరుగుల తేడాతో) |
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..