ఒకరు కాదు ఇద్దరు కాదు భయ్యో.. ఏకంగా 11 మంది ఆటగాళ్లకు ఊహించని షాకిచ్చిన ఐసీసీ.. కారణం ఏంటంటే?
West Indies vs England ODI Series Slow Over Penalty: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో నెమ్మదిగా ఓవర్లు వేసినందుకు వెస్టిండీస్ జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. 11 మంది ఆటగాళ్లపై 5 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు. ఇంగ్లాండ్ తొలి మ్యాచ్‌లో 400 పరుగులు చేసి విజయం సాధించింది. వెస్టిండీస్ జట్టు 162 పరుగులకే ఆలౌట్ అయింది. రెండవ వన్డే ఆదివారం జరగనుంది. వెస్టిండీస్ జట్టుకు ఇది డు ఆర్ డై పరిస్థితి.

ICC Fines West Indies Players England ODI Match: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ 29న జరిగింది. ఇప్పుడు సిరీస్‌లో రెండవ మ్యాచ్ సోఫియా గార్డెన్‌లో జరగనుంది. కానీ, ఈ మ్యాచ్ కు ముందు, ఐసీసీ వెస్టిండీస్ ఆటగాళ్లకు కఠినమైన శిక్ష విధించింది. ఒకరు లేదా ఇద్దరు కాదు ఏకంగా 11 మంది ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు బిగ్ షాక్..
గురువారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు జరిమానా విధించింది. షాయ్ హోప్ జట్టు లక్ష్యం కంటే ఒక ఓవర్ వెనుకబడి ఉంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ప్రతి వెస్టిండీస్ ఆటగాడికి వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించారు. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, హోప్ జట్టు ఒక ఓవర్ తక్కువ వేసిందని ఐసీసీ తెలిపింది.
స్లో ఓవర్ రేట్‌కు జరిమానా..
ఈ శిక్ష ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి సంబంధించిన ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఉంది. ఇది కనీస ఓవర్-రేట్ నేరాలకు సంబంధించినది. నిబంధనల ప్రకారం, తమ జట్టు నిర్ణీత సమయంలో ప్రతి ఓవర్‌ను బౌలింగ్ చేయడంలో విఫలమైతే ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుందని ఐసీసీ తెలిపింది. వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ ప్రతిపాదిత జరిమానాను అంగీకరించాడు. కాబట్టి అధికారిక విచారణ అవసరం లేదు.
తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 400 పరుగులు..
మ్యాచ్ గురించి చెప్పాలంటే, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్ ల హాఫ్ సెంచరీల కారణంగా ఇంగ్లాండ్ 400/8 స్కోరు చేసింది. సమాధానంగా, కరేబియన్ జట్టు (వెస్టిండీస్ క్రికెట్ జట్టు) 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ పేసర్లు సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా, బెథెల్ కూడా తన ఎడమచేతి స్పిన్‌తో ఆకట్టుకున్నాడు.
ఇది కాకుండా, ఇప్పుడు ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం కార్డిఫ్‌లో జరగనుంది. కార్డిఫ్‌లో గెలిస్తే ఇంగ్లాండ్ ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను గెలుచుకుంటుంది. మరోవైపు, ఈ మ్యాచ్ కరేబియన్ జట్టుకు డు ఆర్ డై పరిస్థితి. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ను కూడా కోల్పోతారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








