Jacob Bethell: కొన్నందుకు అప్పుడు ట్రోల్ చేసారు.. కట్ చేస్తే ఆల్ రౌండ్ ఫర్మామెన్స్ తో వీరంగం సృష్టించిన RCB కొత్త ఆల్‌రౌండర్!
జాకబ్ బెథెల్ ఐపీఎల్ 2025 సీజన్ లో RCBకి గుడ్ న్యూస్ అందిచాడు. బిగ్ బాష్ లీగ్‌లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బెథెల్ కేవలం 50 బంతుల్లో 87 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అతను విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాడు. జట్టును గౌరవనీయమైన స్థాయికి చేర్చాడు. ఎనిమిది బౌండరీలు, నాలుగు సిక్సర్లతో బెథెల్ వీరవిహారం చేస్తూ తన సత్తాను చాటాడు. మైదానంలో ఆ క్రియాశీలతతో పాటు, రెండు ఓవర్ల బౌలింగ్‌లో వికెట్ తీయడం ద్వారా కూడా అతను తన ఆల్‌రౌండ్ టాలెంట్‌ను రుజువు చేశాడు. హరికేన్స్‌పై అతని ఆల్‌రౌండ్ ప్రదర్శన IPLలో అతనికి మరింత విశ్వాసం తెచ్చింది.
2024-25 మెజర్ బాష్ లీగ్ (BBL) ఆస్ట్రేలియాలో ఈ రోజు జరుగుతుండగా, అందరూ ఒక యువ ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ గురించి మాట్లాడుతున్నారు. మెల్బోర్న్ రెనిగేడ్స్ తరఫున ఆడుతున్న బెథెల్, హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 50 బంతుల్లో 87 పరుగులు చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. బెల్లెరివ్ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది.
ఇది కేవలం BBLలో కాదు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు కూడా ఉత్సాహాన్ని కలిగించింది. IPL 2025 కోసం RCB జట్టులో చేరనున్న జాకబ్ బెథెల్, ఈ ప్రదర్శనతో తన టాలెంట్‌ను ముందుగానే చూపించాడు.
మెల్బోర్న్ రెనిగేడ్స్ మరియు హోబార్ట్ హరికేన్స్ మ్యాచ్‌లో జాకబ్ బెథెల్ 87 పరుగులు చేసినది ప్రత్యేకంగా నిలిచింది. 50 బంతుల్లో 8 బౌండరీలు మరియు 4 భారీ సిక్సర్లతో, అతను 174 స్ట్రైక్ రేటుతో ఆడాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా రెనిగేడ్స్ 20 ఓవర్లలో 154/7 స్కోరు నమోదు చేయగలిగారు. చివరకు ఆ జట్టు ఓడిపోయినా, బెథెల్ ఇన్నింగ్స్ మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది.
RCB అతనిని ₹2.60 కోట్లు పెట్టి IPL 2025 వేలంలో కొనుగోలు చేయడం వారి స్ట్రాటజీకి పెద్ద జెంప్‌గా మారింది. 2024 IPL తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్ మరియు విల్ జాక్స్‌ను RCB రిటైన్ చేయలేదు. ఇప్పుడు జట్టులో వారిని భర్తీ చేయడానికి జాకబ్ బెథెల్ పెద్ద భరోసాగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవని RCB ఈసారి బెథెల్‌తో చరిత్ర సృష్టించాలని ఆశిస్తోంది.
ఇంగ్లాండ్ తరఫున సెప్టెంబర్ 2024లో అరంగేట్రం చేసిన జాకబ్ బెథెల్, అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన చేస్తూ తన బ్యాటింగ్ సత్తాను చాటుకున్నాడు. టాప్ ఆర్డర్ నుంచీ మిడిల్ ఆర్డర్ వరకు ఏ స్థానంలోనైనా అతని బ్యాటింగ్ సరిపోతుంది. ముఖ్యంగా, ఇన్నింగ్స్‌ను చివరిదాకా నిలబెట్టే అతని నైపుణ్యం RCBకు చాలా అవసరం. అతని T20I స్ట్రైక్ రేట్ 167.96, అది ఎంత వేగంగా పరుగులు చేస్తాడో చూపిస్తోంది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచుల సిరీస్‌లో రెండు అర్ధశతకాలతో (అదీ నాటౌట్) తుది వరకూ నిలబడి మ్యాచ్‌ను ముగించే తన శైలిని చూపించాడు.
RCB సాధారణంగా అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కోరుకుంటుంది, కానీ ఈసారి వారు యువ ప్రతిభపై దృష్టి పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. బెథెల్ కేవలం యువ ఆటగాడే కాదు, అతని బంతిని బలంగా కొట్టగల సామర్థ్యం, బ్యాటింగ్ ఆర్డర్‌లో వివిధ స్థానాల్లో ఆడగల నైపుణ్యం RCBకు అనేక ఎంపికలను ఇస్తుంది.
అతను ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండి, అవసరమైన సమయంలో జట్టుకు ముఖ్యమైన పరుగులు చేయగలడు. ఇది అతన్ని RCB పెద్ద ఆటగాళ్లతో అనుసంధానించడానికి సరైన ఎంపికగా మారుస్తుంది. RCB అభిమానులు కొత్త సీజన్ కోసం చాలా ఆశావహంగా ఉన్నారు. జాకబ్ బెథెల్ RCB జట్టులో చేరడం, వారిని వారి మొదటి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకునే దిశగా నడిపిస్తాడనే ఆశలు బలంగా ఉన్నాయి.
BBLలో తన తొలి అర్ధశతకం ద్వారా బెథెల్ టాలెంట్, పట్టుదలలను ప్రదర్శించాడు. IPL 2025కు సమీపిస్తున్నప్పుడు, ఈ యువ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌పై అందరి దృష్టి ఉంటుంది. అతను RCBకి తొలి ఐపీఎల్ టైటిల్ అందిస్తాడని అందరూ ఆశిస్తున్నారు.
నవంబర్ 25న జెడ్డా లో జరిగిన వేలంలో RCB బెథెల్‌ను రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, విల్ జాక్స్ స్థానంలో బెథెల్‌ను కొనుగోలు చేసినప్పుడు RCB అభిమానుల నుండి ఆ ఫ్రాంచైజ్ తీవ్రమైన విమర్శలకు గురైంది. 2024 సీజన్లో విల్ జాక్స్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. ముఖ్యంగా ఆ జట్టు ప్లయ్స్ ఆఫ్స్ కి వెళ్ళడానికి మూలమయ్యాడు. అయినప్పటికీ జాక్స్ ని కొనుగోలు చెయ్యకపోవడం అందరిని షాక్ కి గురి చేసింది.
బెథెల్ చూపిన ఈ ఆల్‌రౌండర్ ప్రదర్శన RCB కి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి మరి
A maiden BBL half-century for Jacob Bethel 🤩#BBL14 #GETONRED pic.twitter.com/XYaEGOzLy2
— Melbourne Renegades (@RenegadesBBL) January 14, 2025