Smriti Mandhana: 12 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆల్ టైం రికార్డు.. బ్యాట్‌తో మంట పుట్టించిన లేడి కోహ్లీ
టీమిండియా వుమెన్ క్రికెటర్ స్మృతి మందాన రికార్డుల మోత కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్‌గా వన్డేల్లో సునామీ సెంచరీ బాదేసింది. అంతేకాదూ.. పది సెంచరీలు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలిచింది లేడీ కోహ్లీ స్మతి మందాన. ఆ వివరాలు ఈ వార్తలో చూసేయండి..
భారత స్టార్ ప్లేయర్ స్మృతి మందాన అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 4వేల పరుగుల మార్క్‌ను అందుకున్న భారత తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన స్మృతి మందాన. లేటెస్ట్‌గా 70 బంతుల్లోనే సెంచరీ బాదేసింది. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా.. వన్డే క్రికెట్‌లో పది అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలిచింది. 2024లో అంతర్జాతీయంగా 1602 పరుగులు చేసింది. మహిళల క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించింది. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 50 ప్లస్ స్కోర్లు చేసిన ఘనత కూడా సొంతం చేసుకుంది.
2013లో వన్డే అరంగేట్రం చేసిన మంధాన.. తక్కువ కాలంలోనే కీలక ప్లేయర్‌గా ఎదిగింది. దశాబ్దానికి పైగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో విజయాలు అందించింది. సెంచరీలు, హాఫ్ సెంచరీలు నీళ్లు తాగినంత ఈజీగా బాదేస్తూ సరికొత్త రికార్డ్‌లతో దూసుకెళ్తోంది. మరోవైపు ఈ మధ్యే ముంబై వుమెన్ క్రికెటర్ ఉమన్ ఇరా జాదవ్ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. భారత అండర్ -19 మహిళల వన్డే టోర్నీలో 14ఏళ్ల ఇరా జాదవ్ ట్రిపుల్ సెంచరీ సాధించింది. 346 పరుగుల్లో 42ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయంటే విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరులో ముంబై – మేఘాలయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించింది. మహిళా క్రికెటర్లు రికార్డ్‌ల మీద రికార్డ్‌లు క్రియేట్ చేయడం మంచి పరిణామం అంటూ సీనియర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.