AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs KKR: ఆర్‌సీబీతో కీలక పోరు.. కేకేఆర్ ప్లేయింగ్ XIలో మూడు మార్పులు.. ఎవరొచ్చారంటే?

RCB vs KKR: ఈ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (RCB vs KKR) కి ప్రత్యేకంగా ఏమీ లేదు. వేలంలో రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ ఇప్పటివరకు 142 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రింకు సింగ్ 10 ఇన్నింగ్స్‌లలో 197 పరుగులు చేశాడు.

RCB vs KKR: ఆర్‌సీబీతో కీలక పోరు.. కేకేఆర్ ప్లేయింగ్ XIలో మూడు మార్పులు.. ఎవరొచ్చారంటే?
Rcb Vs Kkr Playing Xi
Venkata Chari
|

Updated on: May 16, 2025 | 12:49 PM

Share

RCB vs KKR: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి ముగిసిన తర్వాత, మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మే 17 నుంచి ప్రారంభమవుతుంది. కాగా, మే 8న, భద్రతా కారణాల దృష్ట్యా పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అకస్మాత్తుగా మధ్యలో ఆగిపోయింది. దీంతో బీసీసీఐ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి IPL 2025ని ఒక వారం పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు IPL 2025 రెండవ దశలో, మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs KKR) మధ్య జరుగనుంది. ఇది రాత్రి 7:30 నుంచి ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో ఓసారి చూద్దాం..

కోల్‌కతా సమస్యలను మరింత పెంచిన మొయిన్..!

అజింక్య రహానే నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (RCB vs KKR) చెన్నై సూపర్ కింగ్స్‌తో తమ చివరి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ప్లేఆఫ్‌కు వారి మార్గం చాలా కష్టంగా మారింది. కేకేఆర్‌కి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండింటిలోనూ గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ రెండు గెలిస్తే, కోల్‌కతా 15 పాయింట్లను మాత్రమే చేరుకోగలదు. ఇటువంటి పరిస్థితిలో వారు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఈ క్లిష్ట పరిస్థితిలో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ జట్టును విడిచిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్‌ సమస్యలు పెరిగాయి.

బ్యాటర్స్ బాధ్యత తీసుకోవాలి..

ఈ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (RCB vs KKR) కి ప్రత్యేకంగా ఏమీ లేదు. వేలంలో రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ ఇప్పటివరకు 142 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రింకు సింగ్ 10 ఇన్నింగ్స్‌లలో 197 పరుగులు చేశాడు. ఇది కాకుండా, ఆండ్రీ రస్సెల్ డెత్ ఓవర్లలో కూడా ప్రభావం చూపలేకపోయాడు. అయితే, జట్టుకు సానుకూల అంశం కెప్టెన్ అజింక్య రహానె ఫామ్.

ఈ సీజన్‌లో అతను కేకేఆర్ తరపున అత్యధికంగా 375 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంగ్‌క్రిష్ రఘువంశీ 1 అర్ధ సెంచరీ సహాయంతో 286 పరుగులు చేశాడు. కోల్‌కతా ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే, బ్యాట్స్‌మెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs KKR) పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడవలసి ఉంటుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI..

అజింక్యా రహానే (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్.

ఇంపాక్ట్ ప్లేయర్- అంగ్‌క్రిష్ రఘువంశీ.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..