Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs CSK, Weather Update: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మారిన బెంగళూరు వెదర్ రిపోర్ట్.. పూర్తి మ్యాచ్‌ జరిగే ఛాన్స్?

IPL 2024, RCB vs CSK, Weather Update: IPL 2024 సీజన్‌లో మే 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగే ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు, అందరి దృష్టి కూడా స్టేడియంపై ఉన్న నల్లని మేఘాలపైనే ఉంది. ప్లేఆఫ్‌కు నిర్ణయాత్మక మ్యాచ్‌లో వర్షం ముప్పు ఉంది.

RCB vs CSK, Weather Update: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మారిన బెంగళూరు వెదర్ రిపోర్ట్.. పూర్తి మ్యాచ్‌ జరిగే ఛాన్స్?
Rcb Vs Csk Weather Report
Venkata Chari
|

Updated on: May 18, 2024 | 3:21 PM

Share

IPL 2024, RCB vs CSK, Weather Update: IPL 2024 సీజన్‌లో మే 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగే ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు, అందరి దృష్టి కూడా స్టేడియంపై ఉన్న నల్లని మేఘాలపైనే ఉంది. ప్లేఆఫ్‌కు నిర్ణయాత్మక మ్యాచ్‌లో వర్షం ముప్పు ఉంది. వాతావరణ శాఖ బెంగళూరు నగరంలో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే ఇంతలో RCBకి శుభవార్త వెలువడింది.

స్పష్టమైన వాతావరణం..

వాస్తవానికి, బెంగళూరు నగరంలో ఈరోజు తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రెండు రోజుల క్రితం వరకు మ్యాచ్ జరగడం సాధ్యం కాదనే ఊహాగానాలు వచ్చాయి. కానీ, తాజా అప్‌డేట్ ప్రకారం, మే 18 మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా ఉదయం కూడా వాతావరణం స్పష్టంగా కనిపించింది. అయితే రాత్రి సమయంలో వాతావరణం మెరుగై పూర్తి మ్యాచ్ ఆడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కానీ బెంగళూరు వాతావరణం అకాల మార్పులకు ప్రసిద్ధి చెందింది. ఎండ వాతావరణం ఎప్పుడు వర్షంగా మారుతుందో ఊహించడం కష్టం.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ వాష్ అవుట్ అయితే చెన్నైకే లాభం..

ప్లేఆఫ్‌ కోణంలో ఈ మ్యాచ్‌ రెండు జట్లకు చాలా కీలకం. RCB 18 పరుగులతో లేదా 11 బంతులు మిగిలి ఉండగానే CSKని ఓడించినట్లయితే, అది 14 పాయింట్లు, మెరుగైన రన్ రేట్‌తో చివరి-4కి చేరుకుంటుంది. మరోవైపు ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే చెన్నైకి విజయం మాత్రమే కావాలి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే 15 పాయింట్లతో CSK అర్హత సాధిస్తుంది. CSK ప్రస్తుతం 13 మ్యాచ్‌లలో 14 పాయింట్లను కలిగి ఉంది. మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓవర్‌ల తగ్గింపు ఆర్‌సీబీకి దాని మార్గం కష్టతరం చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, RCB మ్యాచ్‌లో వర్షం పడకూడదని, మ్యాచ్ 20-20 ఓవర్‌లుగా ఉండాలని కోరుకుంటుంది. అందువల్ల RCB ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే, దానికి వాతావరణం మద్దతు కూడా అవసరం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..