Kohli Argument With Umpire: అంపైర్‌పై విరుచుకపడ్డ కోహ్లీ.. తప్పుడు నిర్ణయాలపై ఆటగాళ్లతో కలిసి ఆటపట్టించిన ఆర్‌సీబీ కెప్టెన్
అక్టోబర్ 11న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2021 తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో, పేలవమైన అంపైరింగ్ కనిపించింది. దీని కారణంగా విరాట్ కోహ్లీ కోపంతో ఊగిపోయాడు.
RCB vs KKR, IPL 2021 Eliminator: అక్టోబర్ 11న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2021 తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో, పేలవమైన అంపైరింగ్ కనిపించింది. దీని కారణంగా విరాట్ కోహ్లీ కోపంతో ఊగిపోయాడు. మైదానంలోనే అంపైర్ వీరేంద్ర శర్మతో గొడవపడ్డాడు. వాస్తవానికి అంపైర్ మూడుసార్లు తప్పుడు నిర్ణయాలు ప్రకటించాడు. అయితే సమీక్షలో విరాట్ కోహ్లీకి అనుకూలంగా నిర్నయాలు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో అంపైర్‌పై విరుచపడ్డాడు. ఆ తరువాత తన టీం ఆటగాళ్లలో కలిసి ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
మొదటి ఆర్‌సీబీ బ్యాటింగ్ సమయంలో అంపైర్ 16 వ ఓవర్‌లో షాబాజ్ అహ్మద్, 20 వ ఓవర్‌లో హర్షల్ పటేల్‌ను ఎల్బీగా ప్రకటించడం అంపైర్ తప్పుడు నిర్ణయాలుగా తేలాయి. రెండు సార్లు బంతి బ్యాట్ అంచుని తీసుకొని ప్యాడ్‌ని తాకింది. రెండు సార్లు ఆర్‌సీబీ డీఆర్‌ఎస్ తీసుకోవడం ద్వారా వికెట్‌ని కాపాడుకుంది. అంపైర్ తప్పుడు నిర్ణయాల కారణంగా ఆర్‌సీబీ 2 పరుగులు కోల్పోయింది.
కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో యుజ్వేంద్ర చాహల్ వేసిన 7 వ ఓవర్ చివరి బంతికి రాహుల్ త్రిపాఠికి వ్యతిరేఖంగా ఎల్బీగా అప్పీల్ చేశారు. కానీ, దానిని అంపైర్ తిరస్కరించాడు. దీంతో కోహ్లీ డీఆర్‌ఎస్ తీసుకుని విజయం సాధించాడు. దీంతో అంపైర్‌పై చాలా కోపంతో బాల్‌ను కిందకేసి బలంగా కొట్టి, అంపైర్‌తో గొడవపడ్డాడు. అనంతరం తోటి ఆటగాళ్లతో కలిసి అంపైర్‌ను ఆటపట్టించాడు.
— pant shirt fc (@pant_fc) October 11, 2021