IPL 2021: ఆర్‌సీబీ బౌలర్‌, ఆయన భార్యపై కోహ్లీ అభిమానుల నీచమైన కామెంట్లు.. పనికిరాని వాళ్లంటూ మ్యాక్స్‌వెల్ వార్నింగ్

Venkata Chari

Venkata Chari |

Updated on: Oct 12, 2021 | 12:18 PM

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్ డాన్ క్రిస్టియన్ విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో నాటౌట్ గా తొమ్మిది పరుగులతో నిలిచాడు. అలాగే బౌలింగ్‌లో సునీల్ నరైన్ దెబ్బకు ఓ ఓవర్‌లో 22 పరుగులు ఇచ్చాడు.

IPL 2021: ఆర్‌సీబీ బౌలర్‌, ఆయన భార్యపై కోహ్లీ అభిమానుల నీచమైన కామెంట్లు.. పనికిరాని వాళ్లంటూ మ్యాక్స్‌వెల్ వార్నింగ్
Dan Christian

Follow us on

RCB vs KKR, IPL 2021 Eliminator: ఐపీఎల్ 2021 ఎలిమినేటర్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ప్రయాణం ముగిసింది. చివరి ఓవర్ వరకు కొనసాగిన మ్యాచ్‌లో కేకేఆర్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్ 2 కి చేరుకుంది. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. కానీ, ఆర్‌సీబీ ఓటమి తరువాత జట్టులోని ఒక ఆటగాడు సోషల్ మీడియాలో ట్రోలర్స్‌ లక్ష్యానికి గురయ్యాడు. ఓటమికి అతడిని బాధ్యుడిని చేస్తూ సోషల్ మీడియా వినియోగదారులు డానియల్ క్రిస్టియన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దారుణమైన కామెంట్లతో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి. ఆమెను కూడా నీచమైన కామెంట్లు చేస్తున్నారు. దీంతో డాన్ క్రిస్టియన్ ఓ పోస్ట్ చేశాడు. దయచేసి ఇలాంటి కామెంట్లతో దాడి చేయవద్దంటూ నెట్టింట్లో విజ్ఞప్తి చేశాడు.

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్టియన్ విఫలమయ్యాడు. అతను బ్యాటింగ్‌లో నాటౌట్‌గా నిలిచి తొమ్మిది పరుగులు చేశాడు. బౌలింగ్ సమయంలో నరైన్ దెబ్బకు ఓ ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి. సునీల్ నరైన్ తన బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. చివరికి ఈ ఓవర్ చాలా ఖరీదైనదిగా మారింది. కేకేఆర్ తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో గెలిచింది. డేన్ క్రిస్టియన్ ఓవర్‌లో 22 పరుగులు చేయకపోతే మ్యాచ్ ఆర్‌సీబీ ఖాతాకు వెళ్లేది. కానీ, నరైన్ దెబ్బకు మ్యాచ్ మొత్తం మారిపోయింది. ఈ ఓటమి ఆర్‌సీబీ ఐపీఎల్ విజేత కరువును ఏడాది పాటు పొడిగించింది. అలాగే ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కెరీర్ ట్రోఫీ లేకుండానే ముగిసింది. దీంతో ఆగ్రహించిన ఆర్‌సీబీ, కోహ్లీ అభిమానులు క్రిస్టియన్‌ని లక్ష్యంగా చేసుకున్నారు.

ప్లీజ్ ఆపండి: క్రిస్టియన్ విజ్ఞప్తి క్రిస్టియన్‌తో పాటు అతని భాగస్వామి జార్జియా డన్ ఖాతాలను ట్యాగ్ చేస్తూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరినీ లక్ష్యంగా చేసుకుని బూతులు తిడుతున్నారు. దీంతో ఈ ఆస్ట్రేలియా ఆటగాడు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్‌స్టాగ్రాం స్టోరీలో అలాంటి కామెంట్లు చేయవద్దని అభిమానులను కోరారు. ‘నా భాగస్వామి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లోని వ్యాఖ్యలను చూడండి. ఈ రాత్రి నాకు కేకేఆర్‌తో మ్యాచ్ కలిసిరాలేదు. కానీ, ఇది ఆట. దయచేసి ఆమెను వేరుగా ఉంచండి’ అంటూ ప్రార్థించాడు. దీనిపై గ్లెన్ మాక్స్‌వెల్ కూడా ఓ పోస్ట్ చేశాడు. తనను, తన బృంద సభ్యులను దారుణంగా ట్రోల్స్ చేస్తున్న వారు పనికిరాని వారంటూ రివర్స్ పంచ్ విసిరాడు. అలాగే ఆటను ఆటలా చూడాలి.. కానీ, ఇలా కుటుంబాలను టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్లు ఇవ్వొదంటూ వార్నింగ్ ఇచ్చాడు.

‘నిజమైన ఆర్‌సీబీ అభిమానుల మద్దతు లభించినందుకు చాలా ధన్యవాదాలు. సోషల్ మీడియాను కూడా భయపెట్టేలా మార్చిన పనికిరాని వ్యక్తులు కొందరు ఉన్నారు. ఓ ఆటగాడిని, అతడి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. వారిని ఎవ్వరూ క్షమించరు. ఇలాంటి కామెంట్లు చేస్తే, మిమ్మల్ని అంతా బ్లాక్ చేస్తారు’ అంటూ రాసుకొచ్చాడు.

Also Read: Kohli Argument With Umpire: అంపైర్‌‌పై విరుచుకపడ్డ కోహ్లీ.. తప్పుడు నిర్ణయాలపై ఆటగాళ్లతో కలిసి ఆటపట్టించిన ఆర్‌సీబీ కెప్టెన్

Virat Kohli: కోహ్లీని ఏడిపించిన ఐపీఎల్ ట్రోఫీ.. భావోద్వేగాన్ని ఆపుకోలేక తోడైన డివిలియర్స్.. నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోన్న వీడియో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu