RCB IPL 2023 Squad: ఈసారైనా టైటిల్‌ ‘బెంగ’ తీరేనా? కోహ్లీ టీంలోకి ఇంగ్లండ్‌ ఎమర్జింగ్‌ బౌలర్‌

RCB IPL 2023 Auction: విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డీవిలియర్స్, కెవిన్ పీటర్సన్, షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ , యువరాజ్ సింగ్ ఇలా ఎందరో స్టార్లు బెంగళూరుకు ఆడినా ట్రోఫీ మాత్రం దక్కలేదు.

RCB IPL 2023 Squad: ఈసారైనా టైటిల్‌ 'బెంగ' తీరేనా? కోహ్లీ టీంలోకి ఇంగ్లండ్‌ ఎమర్జింగ్‌ బౌలర్‌
Rcb Ipl Auction
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2022 | 6:49 PM

Royal Challengers Bangalore IPL Auction Players List: ఐపీఎల్‌ మొదటి సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్‌ అందని ద్రాక్ష లాగానే ఉంది. ప్రతిసారి ఎన్నో ఆశలతో టోర్నీలోకి అడుగుపెట్టడం, బొక్కాబోర్లా పడడం ఆ జట్టుకు పరిపాటిగా మారిపోయింది. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డీవిలియర్స్, కెవిన్ పీటర్సన్, షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ , యువరాజ్ సింగ్ ఇలా ఎందరో స్టార్లు బెంగళూరుకు ఆడినా ట్రోఫీ మాత్రం దక్కలేదు. 2022 సీజన్‌లోనైనా ఆర్సీబీ రాత మారుతుందని మరోసారి భావించిన ఆర్సీబీ ఫ్యాన్స్ కు చివరకు నిరాశే మిగిలింది. ప్లే ఆఫ్‌ స్టేజ్‌కు వెళ్లినా నాకౌట్‌ స్టేజ్‌లో తేలిపోయింది. గత సీజన్‌లో ఆ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం 14 మ్యాచ్‌లలో ఎనిమిదింటిలో గెలిచింది. మరో ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. ఈనేపధ్యంలో 2023 సీజన్‌ కోసం బలమైన జట్టును తయారుచేసింది బెంగళూరు ఫ్రాంచైజీ. కాగా ప్రస్తుతం కొచ్చి వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ మినీ వేలంలో ఆ జట్టు ఇంగ్లండ్‌ టాప్ బౌలర్‌ రీస్‌ టాప్లీని కొనుగోలు చేసింది. అతనిని రూ. 1.9 కోట్లకు కోనుగోలు చేసింది.

బెంగళూరు కొనుగోలు చేసిన ప్లేయర్స్..

  • రీస్ టోప్లీ -రూ. 1.9 కోట్లు
  • హిమాన్షు శర్మ -రూ. 20 లక్షలు,
  • విల్ జాక్వెస్ రూ. 3.20 కోట్లు

RCB అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు వీరే..

ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రాడ్, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్ హస్రంగ, ఆకాష్ దీప్.

ఇవి కూడా చదవండి

రిలీజైన ఆటగాళ్లు..

జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లవ్‌నిత్ సిసోడియా.

RCB ఫుల్ స్క్వాడ్ :

ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రాడ్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ పత్ర్ కౌల్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, రీస్ టాప్లీ

ఐపీఎల్ లైవ్ యాక్షన్ లైవ్ ఇక్కడ వీక్షించండి