AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tourism : హైదరాబాద్ టు అరుణాచలం! శివరాత్రి వేళ ఐఆర్‌సీటీసీ అదిరిపోయే గిఫ్ట్.. తక్కువ ధరకే జ్యోతిర్లింగాల దర్శనం!

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) తీపి కబురు అందించింది. 'దివ్య దక్షిణ యాత్ర' పేరుతో జ్యోతిర్లింగాల దర్శనానికి ప్రత్యేక రైలు టూర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అతి తక్కువ ధరలోనే అరుణాచలం, రామేశ్వరం వంటి పవిత్ర క్షేత్రాలను సందర్శించే అద్భుత అవకాశం ఇది. ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

IRCTC Tourism : హైదరాబాద్ టు అరుణాచలం! శివరాత్రి వేళ ఐఆర్‌సీటీసీ అదిరిపోయే గిఫ్ట్.. తక్కువ ధరకే జ్యోతిర్లింగాల దర్శనం!
Irctc South India Tour Package 2026
Bhavani
|

Updated on: Feb 11, 2026 | 8:00 PM

Share

ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగనుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ స్పెషల్ ట్రైన్ అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తిరుచ్చి తంజావూరు వంటి ప్రముఖ క్షేత్రాలను కవర్ చేస్తుంది. మధ్యతరగతి భక్తులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను అధికారులు నిర్ణయించారు.ఈ ప్యాకేజీ వివరాలు మరిన్ని తెలుసుకుందాం..

టికెట్ ధరలు, క్లాస్ వివరాలు:

ఎకానమీ క్లాస్: పెద్దలకు రూ.14,700, పిల్లలకు (5-11 ఏళ్లు) రూ.13,800.

కంఫర్ట్ క్లాస్: పెద్దలకు రూ.28,700, పిల్లలకు రూ.27,400.

యాత్ర సాగేది ఇలా :

ప్రారంభం: ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది.

ముఖ్య స్టేషన్లు: జనగామ, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. భక్తులు తమకు అనువైన స్టేషన్‌లో రైలు ఎక్కవచ్చు.

దర్శనీయ క్షేత్రాలు:

డే 2: అరుణాచలం ఆలయ దర్శనం.

డే 3, 4: రామేశ్వరం దర్శనం మరియు మధురై ప్రయాణం.

డే 5: కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్, సన్ సెట్ పాయింట్ సందర్శన.

డే 6: త్రివేండ్రం శ్రీ పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్.

డే 7: తంజావూరు బృహదీశ్వర ఆలయ దర్శనం.

 ఎనిమిదో రోజు రాత్రి 9 గంటలకు రైలు తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది.