AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: చెక్‌పోస్ట్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ట్రాక్టర్.. ఆపి చూడగా.. అందులో.!

అన్నమయ్య జిల్లాలో ఎప్పటిలానే పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. అయితే దూరం నుంచి ఓ ట్రాక్టర్ అటుగా వచ్చింది.. సరిగ్గా తనిఖీల స్పాట్ కి రాగానే.. అందులోని నలుగురు వ్యక్తులు లగెత్తారు. పోలీసులకు అనుమానమొచ్చి వారి వెంట పరిగెత్తి పట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిందిదే.

Andhra: చెక్‌పోస్ట్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ట్రాక్టర్.. ఆపి చూడగా.. అందులో.!
Representative Image
Raju M P R
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 7:50 PM

Share

అన్నమయ్య జిల్లాలో భారీగా ఎర్రచందనాన్ని సీజ్ చేశారు. సుండుపల్లి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ట్రాక్టర్‌ను గుర్తించారు. అందులోని రూ. 1.65 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది.. నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు తమిళనాడుకు చెందిన వారైతే మరో ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన స్థానిక స్మగ్లర్లుగా గుర్తించారు.

వివరాల్లోకెళ్తే.. సినీ ఫక్కీలో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాను గుర్తించారు. సుండుపల్లి మండలం పించా ప్రాజెక్ట్ వద్ద పెద్ద మొత్తంలో 72 దుంగలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెడ్ శాండల్ టాస్క్‌ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు సూచనల మేరకు SP శ్రీనివాస్ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ట్రాక్టర్‌లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తూ స్మగ్లర్లు కనిపించారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. ఛేజ్ చేసి నలుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. మరికొందరు పరారైనట్లు గుర్తించారు. ట్రాక్టర్, ట్యాంకర్‌తో పాటు అందులో లోడ్ చేసిన 72 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నలుగురు స్మగ్లర్లను విచారించగా ఇద్దరు తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన వారు కాగా, చిత్తూరు జిల్లాకు చెందిన వారు మరో ఇద్దరుగా గుర్తించి అరెస్ట్ చేసారు. స్మగ్లింగ్ ముఠా వెనుక ఉన్నదెవరు, నెట్‌వర్క్ ఎక్కడదాకా విస్తరించిందన్న దానిపై ఆరా తీస్తున్నట్లు రెడ్ శాండిల్ హెడ్ సుబ్బారాయుడు తెలిపారు. స్మగ్లింగ్ వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదన్నారు రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు.