AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: సిక్సర్లు బాదుతున్న టీమిండియా ఫినిషర్.. కానీ మ్యాచ్‌లో రాణిస్తాడో లేదో తెలియడం లేదు..

IND vs AFG: T20 ప్రపంచ కప్ 2021లో భారత క్రికెట్ జట్టు అందరిని నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. తాజాగా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడనుంది.

IND vs AFG: సిక్సర్లు బాదుతున్న టీమిండియా ఫినిషర్.. కానీ మ్యాచ్‌లో రాణిస్తాడో లేదో తెలియడం లేదు..
Ravindra Jadeja
uppula Raju
|

Updated on: Nov 03, 2021 | 3:29 PM

Share

IND vs AFG: T20 ప్రపంచ కప్ 2021లో భారత క్రికెట్ జట్టు అందరిని నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. తాజాగా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడనుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంది. టీమ్ ఇండియా ఆటగాళ్లందరు ఈ మ్యాచ్‌పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. అయితే భారత జట్టు ఆల్‌రౌండర్‌గా, ఫినిషర్‌గా ఆడుతున్న రవీంద్ర జడేజా మ్యాచ్‌కు ముందు అఫ్గాన్ జట్టుకు ఒక వీడియో ద్వారా హెచ్చరిక పంపించాడు.

మ్యాచ్‌కు ముందు రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో చెమటోడ్చాడు. నెట్స్‌లో లాంగ్ షాట్లు కొట్టడంపై దృష్టి సారించి బలమైన షాట్లు ఆడాడు. రవీంద్ర జడేజా బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇందులో అతను బౌలర్లను చిత్తు చేస్తూ కనిపిస్తాడు. అద్బుతమైన షాట్లు ఆడతాడు. ఈ వీడియో చూసి బీసీసీఐ కూడా ప్రశంసించింది. ‘రవీంద్ర జడేజా ఎంత హిట్ అయ్యాడో’ అని క్యాప్షన్ పెట్టింది.

టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రవీంద్ర జడేజా పెద్దగా రాణించలేదు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా సాధించలేదు. బ్యాటింగ్‌లో పెద్దగా స్కోరు చేయలేదు. పాకిస్థాన్‌పై అతను 13 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా అజేయంగా 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాను 100 పరుగులకు మించి తీసుకెళ్లాడు.

చివరి ఓవర్‌లో కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. అయితే రాబోయే మ్యాచ్‌ల్లో అతని నుంచి మరింత మెరుగైన ఆటను టీమ్ ఇండియా ఆశిస్తోంది. జడేజా ఇటీవల ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఫినిషర్ పాత్ర పోషించాడు. ఇక్కడ అతను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. RCBతో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగులు చేశాడు. ఆ తర్వాత KKRతో జరిగిన మ్యాచ్‌లోనూ తన బలమైన బ్యాటింగ్‌తో CSKని గెలిపించాడు. ఇక అఫ్గానిస్థాన్‌పై ఎలా ఆడతాడో చూడాలి.

Viral Video: మొసలి నవ్వడం ఎప్పుడైనా చూశారా..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

Chinmayi Sripada: ఆ హక్కు నీకుంది.. ఎవరి పెత్తనం అవసరం లేదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..

Puneeth Raj Kumar: రాబంధులను మించిపోయారు.. పునీత్ హఠాన్మరణాన్ని బిజినెస్‌కు వాడుకుంటున్న ఆసుపత్రులు..