AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs Afghanistan: భారత్ నిలవాలంటే భారీ విజయం తప్పనిసరి.. ఆఫ్ఘనిస్థాన్‌‌పై గెలవాలంటే ఈ 5 అంశాలను దాటాల్సిందే.. అవేంటంటే?

టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు పరాజయాలను చవిచూసిన టీమిండియా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఓడిపోగా, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓడిపోయింది.

India Vs Afghanistan: భారత్ నిలవాలంటే భారీ విజయం తప్పనిసరి.. ఆఫ్ఘనిస్థాన్‌‌పై గెలవాలంటే ఈ 5 అంశాలను దాటాల్సిందే.. అవేంటంటే?
T20 World Cup India
Venkata Chari
|

Updated on: Nov 03, 2021 | 4:06 PM

Share

India Vs Afghanistan: టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు పరాజయాలను చవిచూసిన టీమిండియా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఓడిపోగా, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓడిపోయింది. ఇప్పుడు సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాల్సిందే. భారీ తేడాతో గెలవాలనే విషయాన్ని కూడా ఆ జట్టు గుర్తుంచుకోవాలి. ఈరోజు జరిగే మ్యాచ్‌లో విరాట్‌ సేన ఓడిపోతే ప్రపంచకప్‌ నుంచి పూర్తిగా నిష్క్రమించినట్టే.

ఆఫ్ఘనిస్థాన్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్‌లో వారు కూడా పూర్తి ప్రాధాన్యత ఇస్తారనండంలో సందేహం లేదు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు బాబర్ జట్టు పరిస్థితిని దయనీయంగా మార్చారు. చివర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించిన ఆసిఫ్ అలీతో పాక్ జట్టు గెలిచింది. లేదంటే ఓటమి పాలయ్యేది. నేటి మ్యాచ్‌లో ఆ 5 అంశాల గురించి తెలుసుకుందాం. ఈ కారణాలుగానే టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ విజయాన్ని అందుకోగలదు.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పు చేసింది. ఓపెనర్‌గా రోహిత్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్ వచ్చాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ నంబర్ త్రీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేశారు. ఈ మార్పు జట్టుకు పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టింది. భారత జట్టు టాప్ ఆర్డర్ పూర్తిగా ఫ్లాప్ అయింది. నేటి మ్యాచ్‌లో భారత జట్టు ఈ తప్పు చేస్తే భారీ మూల్యంచెల్లించుకోక తప్పదు. రోహిత్ ఒక్కసారి పిచ్‌పై నిలిస్తే, అతను ఏ బౌలర్‌ ఫామ్‌నైనా చెడగొట్టగలడు. 2018 తర్వాత రోహిత్ 50కి పైగా పరుగులు చేసినప్పుడల్లా టీమిండియా సగటు 198 పరుగులు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నేటి మ్యాచ్‌లో రోహిత్‌ ఆడడం చాలా ముఖ్యం. టీమ్ ఇండియా మళ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదు.

ఆఫ్ఘనిస్తాన్ స్పిన్‌కు ఎదురొడ్డి నిలవాలి.. టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బలమైన అంశం వారి స్పిన్ బౌలింగ్. వారి 20 ఓవర్లలో, 12 ఓవర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్ నుంచి ఉన్నాయి. ఈ 12 ఓవర్లను అధిగమించడం టీమ్ ఇండియాకు పెను సవాల్. గత ఏడాది కాలంలో స్పిన్ బౌలర్లపై భారత బ్యాట్స్‌మెన్ల ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇష్ సోధి తన స్పిన్‌పై టీమిండియా బ్యాట్స్‌మెన్‌లను ముప్పుతిప్పలు పెట్టాడు. నేటి మ్యాచ్‌లో భారత జట్టు మళ్లీ ఆ తప్పును పునరావృతం చేయదలుచుకోదు. గత సంవత్సరంలో ఐపీఎల్, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో స్పిన్ బౌలింగ్‌ను బాగా ఆడిన బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ లాంటి బ్యాట్స్‌మెన్ ఉన్నాడు. ఈ ఏడాదిలో స్పిన్‌పై అతని స్ట్రైక్ రేట్ 143గా ఉంది. ఈరోజు మ్యాచ్‌లో ఈ ఆటగాడికి అవకాశం దక్కితే అతడిపై భారీ అంచనాలు నెలకొంటాయి.

పవర్‌ప్లేలో మంచి బౌలింగ్ తప్పనిసరి.. టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా బౌలర్లు తమ రెండు మ్యాచ్‌లలో కేవలం 2 వికెట్లు మాత్రమే తీయగలిగారు. గత కొంత కాలంగా ఆరంభ ఓవర్లలో భారత బౌలర్ల ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. గత 17 మ్యాచ్‌ల్లో ఒక్కసారి మాత్రమే పవర్‌ప్లేలో టీమిండియా ఒకటి కంటే ఎక్కువ వికెట్లు తీయగలిగింది. జస్ప్రీత్ బుమ్రా తప్ప, ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. భారత జట్టు స్పిన్ బౌలర్ ఇంకా వికెట్ల ఖాతా కూడా తెరవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో బౌలర్లు మంచి ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది.

టాప్ ఆర్డర్.. టాప్ ఆర్డర్ బాగా రాణించాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ పూర్తిగా ఫ్లాప్ అయింది. పాకిస్థాన్‌పై షాహీన్ షా ఆఫ్రిది రాహుల్, రోహిత్‌లను ఔట్ చేసిన తీరు ఎవరు మర్చిపోలేరు. న్యూజిలాండ్‌పై కూడా టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ పెద్దగా రాణించలేకపోయింది. ప్రపంచకప్‌కు ముందు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ రెండో మ్యాచ్‌లోనూ పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. రోహిత్ శర్మకు లైఫ్‌లైన్ లభించింది, కానీ అతను దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

పాకిస్థాన్‌పై అద్భుత అర్ధ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ బ్యాట్ న్యూజిలాండ్‌పై పని చేయలేకపోయింది. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ కూడా నిరాశపరిచాడు. నేటి మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ అన్ని విధాలుగా కోల్పోయిన ఫామ్‌ను వెతుక్కోవాలి.

టాప్ ఆర్డర్‌తో పాటు మిడిల్‌ ఆర్డర్‌ రాణించడం కూడా అవసరమని, అలాగే మిడిల్‌ ఆర్డర్‌తో కూడిన టీమిండియా ఈ ప్రపంచకప్‌లో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. హార్దిక్ పాండ్యా ఫామ్, ఫిట్‌నెస్ జట్టుకు అతిపెద్ద సమస్య. అదే సమయంలో పాకిస్థాన్‌పై రిషబ్ పంత్ శుభారంభం అందించినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. న్యూజిలాండ్‌పై పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. ఈరోజు మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ తిరిగి రావచ్చు. అతను స్పిన్ బాగా ఆడతాడు. నేటి డూ ఆర్ డై పోటీలో వారికి ముందుకు నడబడం చాలా ముఖ్యం.

Also Read: IND vs AFG: సిక్సర్లు బాదుతున్న టీమిండియా ఫినిషర్.. కానీ మ్యాచ్‌లో రాణిస్తాడో లేదో తెలియడం లేదు..

ICC T20I Rankings: కోహ్లీసేనకు భారీ షాక్.. టీ20 ర్యాకింగ్స్‌లో కానరాని భారత ఆటగాళ్లు.. అగ్రస్థానంలో పాకిస్తాన్ కెప్టెన్!