ICC T20I Rankings: కోహ్లీసేనకు భారీ షాక్.. టీ20 ర్యాకింగ్స్‌లో కానరాని భారత ఆటగాళ్లు.. అగ్రస్థానంలో పాకిస్తాన్ కెప్టెన్!
ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచ కప్ 2021లో పాకిస్తాన్ టీం వరుస విజయాలతో దూసుకపోతోంది. దీంతో సూపర్ 12 నుంచి సెమీ ఫైనల్ చేరిన తొలి టీంగాను అవతరించింది.
ICC T20I Rankings: ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచ కప్ 2021లో పాకిస్తాన్ టీం వరుస విజయాలతో దూసుకపోతోంది. దీంతో సూపర్ 12 నుంచి సెమీ ఫైనల్ చేరిన తొలి టీంగాను అవతరించింది. ఇదే కాక నేడు ఐసీసీ విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లోనూ పాకిస్తాన్ టీం ఆటగాళ్లు తమ సత్తా చాటారు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ వరుసగా రెండు అర్ధ సెంచరీలు చేయడంతో ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలన్‌ను అధిగమించి ఐసీసీ పురుషుల టీ20ఐ ప్లేయర్‌లో బ్యాటర్లలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై 51, నమీబియాపై 70 పరుగులు చేసి 2009 ఛాంపియన్‌లను సెమీఫైనల్‌లోకి తీసుకెళ్లిన బాబర్, తన కెరీర్‌లో ఆరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. 27 ఏళ్ల అతను జనవరి 28, 2018న మొదటి స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ODIలలో కూడా నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
బాబర్ 834 రేటింగ్ పాయింట్లను సాధించి, డేవిడ్ మలన్ కంటే 36 పాయింట్లు ముందంజలో నిలిచాడు. అయితే 5 మే 2019న కార్డిఫ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగులు చేసిన తర్వాత బాబర్ కెరీర్-బెస్ట్ 896 రేటింగ్ పాయింట్‌లుగా మిగిలిపోయింది. గత ఏడాది నవంబర్ 29 నుంచి మలన్ అగ్రస్థానంలో కొనసాగాడు. ఇక టీమిండియా నుంచి టాప్ టెన్‌లో కేవలం ఇద్దరే బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ 714 పాయింట్లతో 5వ స్థానంలో నిలవగా, 678 పాయింట్లతో కేఎల్ రాహుల్ 8వ స్థానంలో నిలిచాడు.
టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ ప్రదర్శనలు కూడా ర్యాంకింగ్స్‌లో ప్రతిబింబించాయి. ఇంగ్లీష్ ఓపెనర్లు జోస్ బట్లర్, జాసన్ రాయ్ ఇద్దరూ తాజా ర్యాకింగ్స్‌లో పైకి చేరారు. బట్లర్ శ్రీలంకపై తన తొలి టీ20ఐ సెంచరీని కొట్టి కెరీర్‌లో అత్యుత్తమంగా తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. రాయ్ ఐదు స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకున్నాడు.
ఇదిలా ఉంటే, శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌పై వరుసగా రెండు, మూడు వికెట్లు తీసిన తర్వాత తన కెరీర్‌లో మొదటిసారి బౌలింగ్ చార్టులలో అగ్రస్థానంలో నిలిచాడు. అతను ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు చెందిన తబ్రైజ్ షమ్సీ స్థానంలో నిలిచాడు. బౌలింగ్‌లో మాత్రం టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం.
ర్యాంకింగ్స్‌లో మొదటి నాలుగు బౌలర్లు అందరూ మణికట్టు స్పిన్నర్లే కావడం గమనార్హం. ఇంగ్లండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్‌ను అధిగమించి కెరీర్‌లో అత్యుత్తమ 730 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు అన్రిచ్ నార్ట్జే 18 స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్న ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
ఆల్ రౌండర్ల జాబితాలో మహ్మద్ నబీ 271 రేటింగ్ పాయింట్లతో షకీబ్ అల్ హసన్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో హసరంగ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్క ప్లేయర్ కూడా స్థానం పొందలేకపోయారు.
Babar Azam is the new No.1 batter on the @MRFWorldwide ICC Men’s T20I rankings, while Wanindu Hasaranga has claimed top spot on the bowling rankings for the first time ?#T20WorldCup pic.twitter.com/zoCVVJIPze
— ICC (@ICC) November 3, 2021
T20 World Cup 2021: ఆఫ్ఘానిస్తాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతోన్న భారత్.. నెట్స్‌లో చెమటోర్చిన ఆటగాళ్లు..