T20 World Cup 2021: ఆఫ్ఘానిస్తాన్‎తో మ్యాచ్‎కు సిద్ధమవుతోన్న భారత్.. నెట్స్‎లో చెమటోర్చిన ఆటగాళ్లు..

Virat Kolhi : టీ20 ప్రపంచకప్‌లో విజయం కోసం భారత్ ఎదురుచూస్తోంది. పాకిస్తాన్, న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన తర్వాత ఇవాళ ఆఫ్ఘనిస్తాన్‎తో తలపడనుంది. అయితే ఆఫ్ఘాన్‎ను ఇండియా తక్కువ అంచనా వేయడం లేదు.

T20 World Cup 2021: ఆఫ్ఘానిస్తాన్‎తో మ్యాచ్‎కు సిద్ధమవుతోన్న భారత్.. నెట్స్‎లో చెమటోర్చిన ఆటగాళ్లు..
Kohli
Follow us
Srinivas Chekkilla

| Edited By: Anil kumar poka

Updated on: Nov 03, 2021 | 2:04 PM

టీ20 ప్రపంచకప్‌లో విజయం కోసం భారత్ ఎదురుచూస్తోంది. పాకిస్తాన్, న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన తర్వాత ఇవాళ ఆఫ్ఘనిస్తాన్‎తో తలపడనుంది. అయితే ఆఫ్ఘాన్‎ను ఇండియా తక్కువ అంచనా వేయడం లేదు. అందుకే భారత ఆటగాళ్లు మంగళవారం నెట్స్‎లో తీవ్రంగా శ్రమించారు. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెమటలుపట్టేలా ప్రాక్టీస్ చేశారు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్‎ మ్యాచ్‎లో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని టీం ఇండియా భావిస్తోంది. భారత్ ఈ మ్యాచ్‎లో గెలిస్తేనే సెమీస్‎ ఆశలు సజీవంగా ఉంటాయి.

ఆఫ్ఘానిస్తాన్ టీం కూడా ప్రస్తుతం చిన్న జట్టులా కాకుండా తన పూర్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ టీంకు కూడా చెమటలు పట్టించింది. బుధవారం (నవంబర్ 3) అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆఫ్గాన్, ఇండియా పోరు జరగనుంది. అక్టోబర్ 24న పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచ్‎లో భారత్ 10 వికెట్లతో పరాజయం పాలైంది. ఆ మ్యాచ్‎ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఆ మ్యాచ్‎లో భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. భారత్ 151 పరుగులు చేసినా బౌలర్ల వైఫల్యంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక గత ఆదివారం కివీస్‏తో జరిగిన మ్యాచ్‎లో 110 పరుగులకే అలౌట్ అయింది. ఈ మ్యాచ్‎ ఓటమితో ఇండియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రూప్-2లోనాలుగు విజయాలు సాధించిన పాకిస్తాన్ సెమీస్‌కు దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి నమీబియాను ఓడించి నాకౌట్‌లో బెర్త్ దక్కించుకుంది. న్యూజిలాండ్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే భారత్‌కు సెమీస్‌కు అర్హత సాధించే అవకాశం లేదు. ఇండియా తర్వాతి మూడు మ్యాచ్‎ల్లో భారీ తేడాతో విజయం సాధించి.. న్యూజిలాండ్ ఆఫ్ఘానిస్తాన్, నమీబియా, స్కాట్‎లాండ్‎తో జరిగే మ్యాచ్‎ల్లో ఒకదాట్లో ఓడిపోతే ఇండియా సెమీస్ చేరుతుంది. లేకుంటే ఇంటికి వెళ్తుంది.

Read Also.. Shubman Gill : ఏంటి.. సారాతో బ్రేకప్‌ అయ్యిందా.. అనుమానాలు రేకెత్తిస్తోన్న శుభ్‌మన్‌ గిల్‌ ఇన్‌స్టా పోస్ట్‌..