Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: టీం ఇండియా ఎందుకు ఓడిపోతోంది.. కారణాలు ఏంటి.. అభిమానులు ఏం చెబుతున్నారు..

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుస పరాజయాలతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇండియా తన మొదటి మ్యాచ్‎లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది...

T20 World Cup 2021: టీం ఇండియా ఎందుకు ఓడిపోతోంది.. కారణాలు ఏంటి.. అభిమానులు ఏం చెబుతున్నారు..
Ind
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 03, 2021 | 10:08 AM

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుస పరాజయాలతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇండియా తన మొదటి మ్యాచ్‎లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. నమీబియా కంటే వెనుకబడి ఉంది. టీమ్ ఇండియా పరాజయాలకు ప్రధాన కారణం ఏమిటని ఓ వార్త సంస్థ అభిమానులను నుంచి అభిప్రాయాలను సేకరించింది. అభిమానులకు కొన్ని అప్షన్స్ ఇచ్చి వారి అభిప్రాయాలు తీసుకుంది. మొదటి అప్షన్‎గా జట్టు ఎంపిక తప్పు రెండోది సీనియర్ ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం, మూడోది టాస్ వల్ల భారత్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది, నాలుగోది కోచ్‌లు, మెంటార్ సరిగా లేకపోవడం, ఐదోది ఐపీఎల్ తర్వాత చాలా త్వరగా ప్రపంచ కప్ ప్రారంభమవడం (అంటే బయో-బబుల్ ఫెటీగ్) ఉన్నాయి.

“తప్పు జట్టు ఎంపిక” చేశారని ఎక్కువ సంఖ్యలో అభిమానలు చెప్పారు. 30 శాతం మంది అంటే 3942 మంది జట్టు ఎంపిక సరిగా లేదన్నారు. “పాకిస్తాన్‌తో జరిగిన పోరులో భారత్ అత్యంత అనుభవజ్ఞుడైన స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ను తమ ప్లేయింగ్ XIలో ఎంచుకోలేదు. పాకిస్తాన్‌పై ఓటమి తర్వాత, ఇండియా తమ ప్లేయింగ్ XIలో రెండు మార్పులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్‌లను ఎంపిక చేసింది. మహ్మద్ షమీ పాకిస్తాన్‌ మ్యాచ్‎లో భారీగా పరుగులు ఇచ్చినా ప్లేయింగ్ ఎలెవన్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. KL రాహుల్‌తో కలిసి కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో రోహిత్ శర్మ నంబర్ 3 వద్ద బ్యాటింగ్ చేశాడని” అభిమానులు తప్పుబట్టారు. రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్, పృథ్వీ షా, శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్, వెంకటేష్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు జట్టుకు ఎంపిక చేయలేదన్నారు.

ఐపీఎల్ తర్వాత ప్రపంచ కప్ త్వరగా ప్రారంభం కావడం కూడా ఇండియా ఓటమికి కారణమని 3641 మంది చెప్పారు. మొత్తం 26 శాతం మంది రెండో అప్షన్‎కు ఓటు వేశారు. న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత భారత పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా బబుల్ ఫెటీగ్ జట్టును ప్రభావితం చేసినట్లు చెప్పాడు. ఐపీఎల్ తర్వాత ఈ టోర్నమెంట్ జరిగినప్పుడు టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఎప్పుడూ రాణించలేదు. 2910 మంది సీనియర్ ప్లేయర్స్ ఫామ్ కోల్పోవడం వల్ల భారత్ ఓడిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టాస్ ఓడిపోవడం కూడా ఇండియా ఓటమికి కారణమని 1,549 మంది చెప్పారు.

కోచ్‌లు, మెంటార్ సరిగా లేరని 1,279 మంది అభిప్రాయపడ్డారు. అయితే టీ20 ప్రపంచకప్‌కు ఎంఎస్‌ ధోనీని మెంటార్‌గా ప్రకటించడం హర్షణీయమన్నారు. రవిశాస్త్రి ప్రధాన కోచ్‌గా అతని నియామకాన్ని కూడా కొందరు ప్రశ్నించారు. టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అనుభవజ్ఞుడైన అశ్విన్‌ను మినహాయించడం, రోహిత్‌ను ఓపెనింగ్ స్లాట్ నుండి తొలగించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read Also… IND vs AFG T20 World Cup 2021 Match Prediction: తీవ్ర ఒత్తిడిలో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్ ధాటికి నిలిచేనా..?